Home » Tirupathi News
తిరుమల లడ్డూను అపవిత్రం చేయడమంటే హిందువులు ముఖ్యంగా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది క్షమార్హం ఎంత మాత్రం కాదని చెప్పారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి మహా ప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది.
. తిరుపతి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, చేప నూనె వాడటం మహా పాపం అని ఎంపీ బైరెడ్డి శబరి ఆరోపించారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని ఎంపీ బైరెడ్డి శబరి ఉరితీసిన తప్పులేదని హెచ్చరించారు.
తిరుపతి లడ్డూ తయారీలో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై ఈ రోజు సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్లతో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదమంటే ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తుంటారు. హిందూ భక్తులకు అది అత్యంత ఇష్ట ప్రసాదం. అలాంటి పవిత్రమైన ప్రసాదంలో ఎద్దు, పంది తదితర జంతువుల కొవ్వు పదార్థాలతో కల్తీ అయిన నెయ్యిని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వినియోగించారని తేలడం శ్రీవారి భక్తకోటిని దిగ్ర్భాంతికి గురి చేస్తోంది.
‘శ్రీవేంకటేశ్వర స్వామి జోలికొస్తే సర్వనాశనమవుతారని గతంలోనే చెప్పా.. మళ్లీ చెబుతున్నా’ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడటం హేయమని బీజేపీ ఏపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ మండిపడ్డారు.
తిరుమల అపవిత్రతపై తక్షణమే ఉన్నతస్థాయి కమిటీ వేయాలని లేదా సీబీఐతో విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబును ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి డిమాండ్ చేశారు.
తిరుమల ప్రసాదం తయారీలో నాసిరకమైన ముడిసరుకులు వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ పరిశీలించి, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కుళ్లిపోయిన జంతువుల కొవ్వు, చేప నూనె కలిపారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సంచలన వాఖ్యలు చేశారు.