Share News

Tirumala: టీటీడీ కీలక నిర్ణయం.. మూడు రోజులు మహా శాంతి యాగం

ABN , Publish Date - Sep 21 , 2024 | 04:32 PM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి మహా ప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది.

Tirumala: టీటీడీ కీలక నిర్ణయం.. మూడు రోజులు మహా శాంతి యాగం

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి మహా ప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన టీటీడీ ఆ క్రతువులో భాగంగా తొలుత మహా శాంతియాగాన్ని నిర్వహించాలని శనివారం నిర్ణయించింది. మూడు రోజులపాటు ఈ క్రతువు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు శాంతియాగాన్ని జరపనున్నారు. వేదపండితులు, రుత్వికుల నడుమ శ్రీ వేంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.


సంప్రోక్షణకు సీఎం ఆదేశాలు..

తిరుమల శ్రీవారి వారి లడ్డూలో వాడకూడని పదార్థాలను వినియోగించిన నేపథ్యంలో లడ్డూలు తయారు చేసే పోటుతో పాటు, నెయ్యి భద్రపరిచిన ప్రదేశాలను సంప్రోక్షణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. టీటీడీ ఈవో, అధికారులతో శుక్రవారం రెండుసార్లు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీనికి ముందు.. గత వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.


లడ్డూ తయారీ విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావును సీఎం ఆదేశించారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్‌లతో చర్చలు జరుపుతామని ప్రకటించారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని హామీ ఇచ్చారు. తిరుమల సంప్రోక్షణకు సంబంధించిన విధివిధానాలు తెలియజేసేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Prasadam Row: ప్రసాదంలోనూ.. గీ..కుడేనా!?
Ghee: స్వచ్చమైన నెయ్యిని ఎలా గుర్తించాలి? తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వెనుక బయటపడిన నిజాలేంటి?

Updated Date - Sep 21 , 2024 | 05:40 PM