Kishan Reddy: హిందూవుల మనోభావాలు దెబ్బతీశారు
ABN , Publish Date - Sep 21 , 2024 | 07:47 PM
తిరుమల లడ్డూను అపవిత్రం చేయడమంటే హిందువులు ముఖ్యంగా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది క్షమార్హం ఎంత మాత్రం కాదని చెప్పారు.
హైదరాబాద్: కలియుగ ప్రత్యక్ష దైవం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కొంగు బంగారం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న సమాచారం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏటా కోట్లాది మంది దర్శించుకునే తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అనేది ప్రజల విశ్వాసానికి తూట్లు పొడవడమేనని అన్నారు.
ALSO Read:Vijaya Dairy : టీటీడీకి పాల ఉత్పత్తులు అందించేందుకు రెడీ: సబ్యసాచి ఘోష్
హిందువులు ముఖ్యంగా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆరోపించారు. ఇది క్షమార్హం ఎంత మాత్రం కాదని చెప్పారు. కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసిన నేరస్థులకు తగిన శిక్ష పడాలని హెచ్చరించారు. ఈ దిశగా పోలీసు యంత్రాంగం, దర్యాప్తు సంస్థలు ముందుకు వెళ్తున్నాయని ఆశిస్తున్నానని అన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశవిదేశాల నుంచి నిత్యం లక్షలాది భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు.
ALSO Read:Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..
పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని సేవిస్తారని అన్నారు. అప్పుడే తమ దైవ దర్శనం పూర్తయిందని భక్తులు భావిస్తారని అన్నారు. ఇంత పవిత్రంగా భావించే ఈ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వులను, చేప నూనెలను వినియోగించడం క్షమించరాని నేరమని అన్నారు. ఇలాంటి దురాగతానికి బాధ్యులైన వారందరినీ గుర్తించి, తగిన శిక్ష పడేలా చేయాలని అన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలేవీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నారు. దీంతో పాటు తిరుపతిలో అన్య మత ప్రచారం, తిరుమల కొండపైకి మద్యం, మాంసాహారాన్ని తీసుకెళ్లడం, టీటీడీలో అవినీతి అక్రమాలు గత కొన్నేళ్లుగా పతాక శీర్షికలవుతున్నాయని ఆరోపించారు.
సనాతన ధర్మాన్ని, హిందూ ధార్మిక విశ్వాసాలను దెబ్బతీసే కుట్ర గతంలో జరిగిన నేపథ్యంలో వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులను శిక్షించి, తిరుమల పవిత్రతను కాపాడే, భక్తుల మనోభావాలను పరిరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశాన్ని సంచలనాత్మకంగా మార్చవద్దని రాజకీయ పార్టీలకు, ధార్మిక సంస్థలకు విజ్ఞప్తి చేశారు.
పదేపదే తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు భక్తుల నమ్మకం, విశ్వాసం సడలే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో బాధ్యతతో వ్యవహరించి సంయమనం పాటించాలని అన్నారు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి నిత్యం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే లక్లలాది మంది భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు, వారి మనోభావాలను పరిరక్షించేందుకు కృషి చేయాలని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Visakha: రెచ్చిపోయిన కామాంధుడు.. భీమిలిలో మరో దారుణ ఘటన..
AP Politics: జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. పవన్ సమక్షంలో చేరికకు ముహుర్తం ఫిక్స్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News Click Here