Home » Tirupathi News
పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి సినీ నటులు, ఎంబీయూ ఛాన్స్లర్ మంచు మోహన్ బాబు జీవితం నిదర్శనమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశంసలు కురిపించారు. చంద్రగిరిలో శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, ఎంబీయూ మొదటి స్నాతకోత్సవ వేడుకలు ఆదివారం నాడు ఘనంగా జరిగాయి.
కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ(Bhupathiraju Srinivasa Varma) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మర్యాదలతో కేంద్రమంత్రికి అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం శ్రీనివాసవర్మ మీడియాతో మాట్లాడారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు గురువారం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
గంజాయికి బానిసైన ఓ జులాయి.. వృద్ధ మహిళను గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. ఆమె ఇద్దరు మనవరాళ్లపైనా ఇనుప రాడ్తో దాడి చేశాడు.
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్.ఆర్.జయదేవనాయుడు రూ.50లక్షలు పోగొట్టుకున్నారు. ఈనెల 5న వాట్సాప్ కాల్ చేసిన కేటుగాళ్లు తాము సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ అధికారులమంటూ బిల్డప్ ఇచ్చారు. మనీ లాండరింగ్ కేసులో మీ పేరు ఉందని, అరెస్ట్ చేసి జైల్లో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. తాము పంపే అకౌంట్ నంబర్లకు నగదు బదిలీ చేయాలంటూ.. సుమారు రూ.50లక్షలు తమ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.
సీబీఐ అధికారుల పేరుతో మాజీ ఎమ్మెల్యేకే టోకారా వేసి రూ.50 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్ఆర్ జయదేవ నాయుడు (85) తిరుపతి జిల్లా పాకాల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ......
సీబీఐ అధికారుల పేరుతో మాజీ ఎమ్మెల్యేకే టోకరా వేసి రూ.50 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఏపీలోని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్ఆర్ జయదేవ నాయుడు (85) తిరుపతి జిల్లా పాకాల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘరానా మోసం వెలుగుచూసింది.
టాటా గ్రూప్స్ చైర్మన్ చంద్రశేఖరన్ శ్రీవారి దర్శనార్థం గురువారం తిరుమలకు వచ్చారు.
ప్రభు త్వ స్థలాల్లో అనుమతుల్లేకుండా రూ.కోట్ల ప్రజాధనంతో నిర్మించిన వైసీపీ కార్యాలయాలను ప్రజల అవసరాల కోసం కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వానికి సూచించారు.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త తెలిపింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేసింది. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించింది.