Home » TMC
సోషల్ మీడియాలో తన వ్యక్తిగత ఫొటోలను అవమానకర రీతిలో మార్చి, అసభ్యకర హ్యాష్ ట్యాగ్ లు యాడ్ చేసిన ఘటనపై టీఎంసీ(TMC) ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) స్పందించారు. దానిని బీజేపీ(BJP) ట్రోల్ సేన పనిగా ఆరోపించారు. ఆమె ఫొటోలు ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పశ్చిమబెంగాల్లోని జల్పాయ్గురి జిల్లా ధూప్‌గురి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ పెట్టుకున్న ఆశలపై తృణమూల్ కాంగ్రెస్ నీళ్లుచల్లింది. ధూప్‌గురి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ 4,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) మాటలు ఇటీవల తడబడుతున్నాయి. ఒకరి పేరు చెప్పబోయి మరొకరి పేరు చెప్తూ ఇబ్బంది పడుతున్నారు. చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత ఆమె మాట్లాడుతూ, రాకేశ్ రోషన్ గతంలోనే చందమామపై అడుగు పెట్టాడని చెప్పారు.
పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య శుక్రవారంనాడు ఘర్షణలు చెలరేగాయి. దీంతో జిల్లాలో 144 సెక్షన్ విధించింది. అదనపు బలగాలను మోహరించారు. ఖనాకుల్ నెం.1 పంచాయతీ బోర్డు ఏర్పాటుపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ తెలెత్తింది.
అనుచితంగా ప్రవర్తిస్తూ, సభాధిపతి సూచనలను పాటించని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ను పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మిగిలిన కాలమంతా రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన మంగళవారం పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో మంగళవారం వాడివేడి చర్చ జరుగుతోంది. మణిపూర్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని, ముఖ్యమంత్రి బిరేన్ సింగ్‌ను ఆ పదవి నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు.
మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణలకు సత్వరమే తెర దించకపోతే, దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పర్యటించి, ఘర్షణల బాధితులను కలుసుకొని, తెలుసుకొన్న విషయాలను గవర్నర్ అనుసూయియా యూకీకి తెలిపారు. ఈ ఎంపీలు గవర్నర్‌ను కలుసుకున్న తర్వాత రాజ్ భవన్ వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ హింసపై చర్చ జరగాలంటూ ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభలను స్తంభింపజేస్తున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ తదితర పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఘర్షణలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి.
మహిళలను అవమానించే సంఘటనలు తరచూ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మణిపూర్‌లో వివిధ వర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణం బయటపడిన కొద్ది రోజులకు పశ్చిమ బెంగాల్లో అటువంటి దుశ్చర్య బయటపడింది. దొంగతనానికి పాల్పడ్డారనే నెపంతో ఇద్దరు మహిళలను అర్ధనగ్నంగా చేసి, కొందరు మహిళా వ్యాపారులు కొట్టినట్లు తెలుస్తోంది.
రెండున్నర నెలల నుంచి హింసాత్మక సంఘటనలు జరుగుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణ సంఘటనపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన, బాధ వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ప్రకటించారు.