Hooghly clashes: హుగ్లీలో ఘర్షణలు..144 సెక్షన్ విధింపు

ABN , First Publish Date - 2023-08-11T20:03:00+05:30 IST

పశ్చిమబెంగాల్‌ లోని హుగ్లీ జిల్లాలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య శుక్రవారంనాడు ఘర్షణలు చెలరేగాయి. దీంతో జిల్లాలో 144 సెక్షన్ విధించింది. అదనపు బలగాలను మోహరించారు. ఖనాకుల్ నెం.1 పంచాయతీ బోర్డు ఏర్పాటుపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ తెలెత్తింది.

Hooghly clashes: హుగ్లీలో ఘర్షణలు..144 సెక్షన్ విధింపు

హుగ్లీ: పశ్చిమబెంగాల్‌ (West bengal) లోని హుగ్లీ (Hooghly) జిల్లాలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య శుక్రవారంనాడు ఘర్షణలు చెలరేగాయి. దీంతో జిల్లాలో 144 సెక్షన్ విధించింది. అదనపు బలగాలను మోహరించారు. ఖనాకుల్ నెం.1 పంచాయతీ బోర్డు ఏర్పాటుపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ తెలెత్తిందని, ఒకరిపై మరొకరు బాంబులు, రాళ్లు రువ్వుకున్నారని, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి జరిపారని చెబుతున్నారు. ఈ ఘర్షణలలో పలు కార్లు, ఆస్తులు ధ్వంసమయ్యాయి.


పంచాయతీ బోర్డు ఏర్పాటుపై ఘర్షణ..

పంచాయతీ బోర్డు ఏర్పాటు సందర్భంగా ఇరు పార్టీల మధ్య గొడవ మొదలైందని, పరిస్థితిని అదుపు చేయడానికి బదులు పోలీసులు నిస్సహాయంగా చూస్తుండిపోయారని పలువురు ఆరోపించారు. నిజానికి ఖనాకుల్ నెంబర్ 1 పంచాయతీ బోర్డును టీఎంసీ ఏర్పాటు చేసింది. ఇక్కడ 17 స్థానాలకు 8 సీట్లు బీజేపీ, మరో 8 సీట్లు టీఎంసీ గెలుచుకోగా, ఒక సీటు సీపీఎం అభ్యర్థి గెలుచుకున్నాడు. సీపీఎం అభ్యర్థి మద్దతుతో టీఎంసీ పంచాయతీ బోర్డును ఏర్పాటు చేసింది.


కూచ్ బెహర్‌లోనూ ఉద్రిక్తత, లాఠీచార్జి

కాగా, దిన్హటా మతల్హట్‌లో బోర్డు ఏర్పాటుకు సంబంధించిన కూచ్‌బెహర్‌లో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. గ్రామపంచాయతీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలనే విషయంలో ఈ ఘర్షణ తలెత్తినట్టు చెబుతున్నారు. బీజేపీ కార్యకర్తలు కొందరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కొల్లగొట్టేందుకు ప్రయత్నించగా, పోలీసు బలగాలు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశాయి. ఈ పంచాయతీని బీజేపీ గెలుచుకుంది.

Updated Date - 2023-08-11T20:03:00+05:30 IST