Home » TMC
డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడగారనే కారణంగా లోక్‌సభ ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మరిన్ని చిక్కుల్లో పడ్డారు. 'క్యాష్ ఫర్ క్యారీ' దర్యాప్తులో భాగంగా ఆమెపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసును మంగళవారంనాడు నమోదు చేసింది.
పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీ లో భూ ఆక్రమణల కేసులో టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారంనాడు అరెస్టు చేసింది. నిందితుడు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు.
తృణమూల్ కాంగ్రెస్ నేత మహుతా మొయిత్రాను ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసు వెంటాడుతోంది. ఈ కేసులో ఆమెను, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానిని ప్రశ్నించేందుకు ఈనెల 28న తమ ముందు హాజరుకావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు సమన్లు జారీ చేసింది.
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తృణమూల్ కాంగ్రెస్ శుక్రవారంనాడు ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో అక్రమ జోక్యానికి గవర్నర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఎన్నికల సంఘానికి సమాంతరంగా తన కార్యాలయానికి ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఈసీఐ దృష్టికి తెచ్చింది.
మొబైల్ యూజర్లకు వికసిత్ భారత్ పేరుతో వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయి. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వచ్చాయి. దాంతో ఈసీ చర్యలకు ఉప క్రమించింది. వాట్సాప్‌లో వికసిత్ భారత్ పేరుతో మెసేజ్‌లను తక్షణమే ఆపాలని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీచేసింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. తొలిదశలో 102 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా మూడోసారి క్లీన్ స్వీప్‌పై కమలం పార్టీ గురి పెట్టింది.
సీఏఏపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రాజుకుంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని కొందరు వ్యతిరేకిస్తుండగా మరికొందరు స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు రాజకీయ నేతలు చేసిన కామెంట్లు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రధాన పార్టీలు ప్రకటిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బిష్ణుపూర్ లోక్ సభ నియోజకవర్గంలో మాజీ భార్య- భర్తలు బరిలోకి దిగుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుజతా మోండల్ బరిలోకి దిగారు. భారతీయ జనతా పార్టీ నుంచి సౌమిత్రా ఖాన్ పోటీ చేస్తున్నారు. బిష్ణుపూర్‌లో మాజీ భార్య- భర్తలు బరిలోకి దిగడంతో ప్రచారం మరింత హీటెక్కించనుందనే స్థానికులు అంటున్నారు.
'ఇండియా' కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మరో కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చి పశ్చిమబెంగాల్లోని 42 లోక్‌సభ స్థానాలకు 'సోలో'గా అభ్యర్థులను ప్రకటించడంతో రెండు పార్టీల మధ్య 'మిత్రభేదం' తప్పేలా లేదు. బెంగాల్‌లోని బహరామ్‌పూర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరిపై టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ను టీఎంసీ రంగంలోకి దింపింది.
'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఏకపక్షంగా 42 లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఏ ఒత్తిడి కారణంగా టీఎంసీ ఈ నిర్ణయం తీసుకుందో తమకు తెలియదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ''ఎక్స్'' వేదికగా అన్నారు.