Home » TMC
సందేశ్ ఖాళీలో మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత షేక్ షాజహాన్‌ను ఎట్టకేలకు బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని తమిళ మానిలా కాంగ్రెస్ పార్టీ అధినేత జీకే.వాసన్ ప్రకటించారు. ఈ మేరకు ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్లు వెల్లడించారు.
సార్వత్రిక సమరానికి సమయం దగ్గరపడుతున్న వేళ.. టీఎంసీ(TMC) భారీ ర్యాలీ చేపట్టడానికి నిర్ణయించింది. మార్చి 10న కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో తృణమూల్ కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించనుంది.
'ఇండియా' కూటమి పార్టీలతో పొత్తులను కొలిక్కి తెస్తున్న కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్ లోనూ అధికార తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తు ఖరారుకు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 5 లోక్‌సభ సీట్లు కావాలని కాంగ్రెస్ మొదట్నించీ పట్టుపడుతుండగా, రెండు సీట్లు మినహా ఇవ్వలేమంటూ టీఎంసీ కరాఖండిగా చెబుతూ వస్తోంది.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత కూటమికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఇప్పటికే యూపీలో అఖిలేష్‌తో, ఢీల్లీలో ఆప్‌తో కాంగ్రెస్ పార్టీ సీట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు మమతా బెనర్జీ కూడా తన వైఖరిని తగ్గించుకుని సీట్ల పంపకంపై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
సందేశ్‌ఖలీ లైంగిక హింస ఘటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. అసలు విషయాన్ని చెప్పకుండా మౌనంగా ఉంటున్నారని ఆరోపించింది.
ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజిమెంట్ యాక్ట్ ఉల్లంఘన కేసులో సోమవారంనాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కావాల్సిన టీఎంసీ నేత, లోక్‌సభ మాజీ ఎంపీ మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. తనకు 3 వారాలు సమయం కావాలని ఈడీని ఒక లేఖలో ఆమె కోరారని, అంత గడువు ఇవ్వడానికి ఈడీ నిరాకరించిందని సమాచారం.
మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత, నటి మిమీ చక్రవర్తి తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో నెక్ట్స్ ఏ పార్టీలోకి వెళతారని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభ కు తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఆదివారంనాడు ప్రకటించింది. జర్నలిస్టు సాగరిక ఘోష్, టీఎంసీ నేత సుస్మితా దేవ్, నదిముల్ హఖ్, మమతా బాలా ఠాకూర్ పేర్లను ఖరారు చేసింది.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావడం కూడా అనుమానమేనంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బెంగాల్ కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడు, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. మమత బీజేపీకి భయపడే ఆ పార్టీ భాషలోనే మాట్లాడుతున్నారని ముర్షీదాబాద్‌లో శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.