Mamata Banerjee: ఆ ఘటనతో మమత మనస్సాక్షి చనిపోయింది.. చురకలంటించిన బీజేపీ..
ABN , Publish Date - Feb 21 , 2024 | 02:05 PM
సందేశ్‌ఖలీ లైంగిక హింస ఘటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. అసలు విషయాన్ని చెప్పకుండా మౌనంగా ఉంటున్నారని ఆరోపించింది.
సందేశ్‌ఖలీ లైంగిక హింస ఘటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. అసలు విషయాన్ని చెప్పకుండా మౌనంగా ఉంటున్నారని ఆరోపించింది. రాజకీయ ప్రతిష్టను కాపాడుకోవడానికి బెంగాల్‌లో మహిళల గౌరవాన్ని పణంగా పెడుతున్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడకుండా ఉండటాన్ని బట్టి మమత మనస్సాక్షి చనిపోయిందని తెలుస్తోందని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం మౌనం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. సందేశఖలీ ఘటన మహిళా సమాజానికే కాకుండా ప్రజాస్వామ్యమంతటికీ అవమానమని ఫైర్ అయ్యారు. ఈ ఘటనను ప్రశ్నించిన ఓ జర్నలిస్టును కూడా అరెస్టు చేశారని పేర్కొన్నారు.
బెంగాల్‌లోని 24 ఉత్తర పరగణాలు జిల్లాలో పలువురు మహిళలు టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్‌కు వ్యతిరేకంగా నిరసలు చేస్తున్నారు. భూకబ్జాకు పాల్పడుతున్నారని, లైంగికంగా హింసిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. దీనిపై స్పందించిన బెంగాల్ పోలీసులు ఇద్దరు టీఎంసీ నాయకులను అరెస్టు చేశారు. కానీ షాజహాన్ ను మాత్రం అరెస్టు చేయలేదు. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్ ఘటనా స్థలానికి వెళ్లడానికి ప్రయత్నించారు. ఆయనను అడ్డుకునేందుకు టీఎంసీ కార్యకర్తలు, నాయకులు ప్రయత్నించడంతో బీజేపీ, టీఎంసీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. వీరిని అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ ఘటనలో ఎంపీ మజుందార్ కు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనలో బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఉద్దేశ పూర్వకంగా బీజేపీ నాటకం ఆడుతోందని విమర్శించారు. బాధిత మహిళలతో మహిళా కమిషన్ కేసులు పెట్టించింది. మరోవైపు.. రాష్ట్రంలోకి పార్లమెంటు ఎథిక్స్ కమిటీ రావడాన్ని ఖండిస్తూ టీఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ధర్మాసనం స్టే విధించడంతో ప్రస్తుతం సందేశ్‌ఖలీలో అప్రకటిత కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.