Mimi Chakraborty: నటి, టీఎంసీ ఎంపీ మిమీ చక్రవర్తి రాజీనామా..నెక్ట్స్ ఆ పార్టీయేనా?
ABN , Publish Date - Feb 15 , 2024 | 04:48 PM
మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత, నటి మిమీ చక్రవర్తి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో నెక్ట్స్ ఏ పార్టీలోకి వెళతారని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మిమీ చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారు. మిమీ తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సమర్పించారు. తన సీటుపై టీఎంసీ స్థానిక నాయకత్వం అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ జాదవ్పూర్ లోక్సభ స్థానం నుంచి మిమీ చక్రవర్తిని అభ్యర్థిగా ప్రకటించారు. ఆ క్రమంలో మిమీ ఎంపీగా గెలిచారు. అయితే ఇప్పుడు మిమీ ఏ పార్టీలోకి వెళతారనేది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారా లేదా బీజేపీలో చేరుతారా అనేది చూడాలి.