Home » Traffic rules
హైదరాబాద్(Hyderabad) మహానగరంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ముఖ్యంగా సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు, ఇంటి నుంచి సాయంత్రం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) ఆదివారం పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి(CP Kothakota Srinivas Reddy) ఓ ప్రకటనలో తెలిపారు.
తన కుమారుడి చేత పాలిసెట్ రాయించేందుకు ఓ తల్లి పడ్డ ఆవేదన అందరినీ కలిచివేసింది. కానీ అధికారులు మాత్రం కనికరం చూపలేదు. అనంతపురం నగరంలోని ఎస్‌ఎ్‌సబీఎన కళాశాల కేంద్రంలో పాలిసెట్ రాసేందుకు గుత్తి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నితిన.. తన తల్లి లక్ష్మిదేవితో కలిసి శనివారం వచ్చాడు. ఉదయం 8 గంటలకే బయలుదేరినా.. బస్సులు, ఆటోలు సమయానికి దొరక్కపోవడం, ట్రాఫిక్ సమస్య కారణంగా ఆలస్యమైంది. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా.. వారు 11.05 గంటలకు కళాశాల వద్దకు చేరుకున్నారు. నితిన పరుగున వెళ్లినా..
హనుమాన్ విజయయాత్రను పురస్కరించుకొని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(CP Kothakota Srinivas Reddy) తెలిపారు. విజయయాత్ర మంగళవారం ఉదయం గౌలిగూడ రామమందిరం నుంచి బయలుదేరి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వద్ద ముగుస్తుంది.
శ్రీరామనవమి శోభయాత్ర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ బుధవారం వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
Happy Ram Navami 2024: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో(Ram Navami in Hyderabad) భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారం బాగ్(Sitaram Bagh) నుంచి కోటీ వ్యాయామశాల(Koti) వరకు శోభాయాత్ర(Ram Navami Shobha Yatra) నిర్వహించనున్నారు. ఈ శోభాయాత్రకు టాస్క్ ఫోర్స్ పోలీస్తో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్,
ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్)(Ramadan) పండగ సందర్భంగా మీరాలంమండి ఈద్గా, మాసబ్‌ట్యాంక్(Masabtank) హాకీ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(CP Srinivas Reddy) ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం రంజాన్ పండుగ ప్రత్యేక నమాజు దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని(Traffic Rules) తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) హైదరాబాద్ పర్యటన సందర్భంగా సిటీలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈరోజు రాత్రి రాజ్ భవన్లో ప్రధాని బస చేయనున్నారు.
Kumari Aunty Dialogue: కుమారి ఆంటీ (Kumari Aunty).. ఇప్పుడీ పేరు తెలియని వారు బహుశా ఉండరేమో.! యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్.. ఇలా ఏది ఓపెన్ చేసినా సరే కుమారి ఆంటీ.. ఆంటీ.. వాయిస్, వీడియోలే కనిపిస్తుంటాయ్.! హైదరాబాద్‌లోని (Hyderabad) మాదాపూర్ ఏరియాలో రోడ్డుపై మీల్స్ అమ్మే.. సామాన్యురాలు కుమారి.. ఒకే ఒక్క డైలాగ్‌తో ఫేమస్ అయిపోయింది. ‘మీది మొత్తం థవ్‌జండ్ (వెయ్యి రూపాయిలు).. రెండు లివర్లు ఎక్స్ట్రా’ (2 Livers Extra) అని ఆంటీ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాను (Social Media) షేక్ చేశాయి...
తెలంగాణలో ప్రభుత్వం మారాక రూల్స్ అన్నీ మారిపోతున్నాయి. భాగ్యనగరంలో ట్రాఫిక్ అనేది ప్రధాన సమస్య. దీనిపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం అవసరమైతే ట్రాఫిక్ నిబంధనలు మార్చడానికి కూడా వెనకాడొద్దని సంబంధిత అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో హైదరాబాద్ సీపీ, ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగిపోయారు..