Home » TTD
Tirumala News : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో పాటు సోమవారం కూడా సెలవు ఉండటంతో తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఇక శుక్రవారం స్వామివారిని 56,978 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.87 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారి ఆలయంలో రేపు దీపావళి ఆస్థానం జరగనుంది.
పార్వేటి మండపం కూల్చేవేయాలని నిర్ణయం తీసుకోవడంపై నిన్ననే టీటీడీ ఈఓకు లీగల్ నోటీస్ పంపామని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన పార్వేటీ మండపాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కూల్చివేయాలని నిర్ణయం తీసుకోవటం వెనుక ఉన్న అందరిపైనా వారం రోజుల్లో కోర్టులో కేసు వేయనున్నామన్నారు.
ఏడాదికి ఒక్కసారి మాత్రమే కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
ధైర్యం ఉంటే పార్వేట మండపం వద్దకు వచ్చి నిర్మాణం బాగా లేదని చెప్పగలరా అంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తెలిపారు.
అలిపిరి పాదాల మండపం శిదిలావస్థకు చేరుకుందని.. మండపాన్ని జీర్ణోద్ధారణ చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండు అంశాలకు సంబంధించి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర హెచ్చరిక చేశారు.
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు బ్రోచర్‌ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం ఉదయం ఆవిష్కరించారు.
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆదివారం తెల్లవారుజాము 3:15 గంటలకు టీటీడీ అధికారులు స్వామివారి ఆలయం తలుపులు తెరిచారు. పాక్షిక చంద్రగ్రహణం అనంతరం ఆలయాన్ని శుద్ధిచేసి.. భక్తులకు సర్వదర్శనానికి అనుమతించారు.