Share News

Tiruamala : వీకెండ్.. ఆపై సెలవులు.. తిరుమలలో పరిస్థితి ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2023-11-11T09:20:06+05:30 IST

Tirumala News : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో పాటు సోమవారం కూడా సెలవు ఉండటంతో తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఇక శుక్రవారం స్వామివారిని 56,978 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.87 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారి ఆలయంలో రేపు దీపావళి ఆస్థానం జరగనుంది.

Tiruamala : వీకెండ్.. ఆపై సెలవులు.. తిరుమలలో పరిస్థితి ఎలా ఉందంటే..

Tiruamala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో పాటు సోమవారం కూడా సెలవు ఉండటంతో తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఇక శుక్రవారం స్వామివారిని 56,978 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.87 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారి ఆలయంలో రేపు దీపావళి ఆస్థానం జరగనుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను ఈ సందర్భంగా అధికారులు రద్దు చేశారు. ఇక తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోవాలు రెండో రోజు కొనసాగనున్నాయి. పెద్ద శేషవాహనం, రాత్రికి హంసవాహనంపై అమ్మవారు విహరించనున్నారు.

Updated Date - 2023-11-11T09:20:07+05:30 IST