Home » Udayanidhi Stalin
అయోధ్యకు చెందిన పరమహంస ఆచార్య తన తల నరికి తెచ్చివారికి రూ.10 కోట్లు ఇస్తామంటూ రివార్డు ప్రకటించడంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు.తన తలకు రూ.10 కోట్లు అవసరం లేదని, రూ.10 రూపాయల దువ్వెన చాలని వ్యాఖ్యానించారు.
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు బెదిరింపు హెచ్చరిక చేసిన అయోధ్య సాధువు పరమహంస ఆచార్య మరో ప్రకటన చేశారు. ఉదయనిధి తలకు ప్రకటించిన రూ.10 కోట్ల రివార్డు మొత్తాన్ని పెంచుతామని ప్రకటించారు.
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు సరికావని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ బచ్చాగాళ్లు సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేశారని.. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది అనాలోచన వ్యాఖ్య కాదని.. ఈ వ్యాఖ్యాలు భారత ప్రజలు మనోభావాలు దెబ్బ తీశాయన్నారు.
సనాతన ధర్మం నిర్వీర్యం చేయాలనే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్(CM MK Stalin's son, Minister Udayanidhi Stalin)
‘రాజకీయాస్త్రానికి కాదేదీ అనర్హం’ అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. చిన్న సందు దొరికితే చాలు చెలరేగిపోవడమే అనేలా అధికార, విపక్షాలు తయారయ్యాయి. జనాల మధ్య చిచ్చుపెడుతున్నామా? సమాజానికి కీడు తలపెడుతున్నామా?, అనర్థాలకు ఆజ్యం పోస్తున్నామా?.. అనే ఇంగితం లేకుండా సున్నిత అంశాలను సైతం అస్త్రశస్త్రాలుగా వాడుకుంటున్నాయి రాజకీయ పక్షాలు. ఈ ఒరవడి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాకపోయినప్పటికీ రాజకీయ నాయకుల వైఖరి ఆందోళనలను పెంచుతోంది.
సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. తన మాటలకు తాను కట్టుబడి ఉంటానన్నారు. 'కాంగ్రెస్ ముక్త్ భారత్' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనలేదా అని ప్రశ్నించారు.
సనాతన ధర్మం నిర్మూలించాలని హిందువులను అవమాన పరిచారు. కొన్ని పార్టీలు, నేతలు 100 కోట్ల హిందువులను అవమానించారు. ఉధయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఎందుకు తప్పు పట్టలేదు. కాంగ్రెస్ వైఖరిపై ప్రజలు ఆలోచన చేయాలి. గజినీ నుంచి ఔరంగ జేబులు, షాజహాన్, నిజాం, రజాకార్లు, మజ్లీస్లు ఎవరు దాడి చేసినా గుడులు, గోపురాలు, హత్యలు చేసినా ధర్మం పెరుగుతూనే ఉన్నది.’’
సన్నాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... భారత రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసిన మంత్రి ఉదయ్స్టాలిన్, సనాతాన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చి నిర్మూలించాలని తన ఆకాంక్షను వ్యక్తం చేయడం హేయమైన చర్య...రాజ్యాంగ విరుద్ధమన్నారు.
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (CM MK Stalin)కుమారుడు, ఆ రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి, డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin) పిలుపిచ్చారు.