AP BJP Chief: తమిళనాడు మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్‌పై పురందేశ్వరి తీవ్ర విమర్శలు
ABN , First Publish Date - 2023-09-04T11:40:59+05:30 IST
సన్నాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... భారత రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసిన మంత్రి ఉదయ్‌స్టాలిన్, సనాతాన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చి నిర్మూలించాలని తన ఆకాంక్షను వ్యక్తం చేయడం హేయమైన చర్య...రాజ్యాంగ విరుద్ధమన్నారు.
అమరావతి: సన్నాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్ ( TamilNadu Minister Udaynidhi Stalin) చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి (AP BJP Chief Daggubati Purandeshwari) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘భారత రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసిన మంత్రి ఉదయ్‌స్టాలిన్, సనాతాన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చి నిర్మూలించాలని తన ఆకాంక్షను వ్యక్తం చేయడం హేయమైన చర్య...రాజ్యాంగ విరుద్ధం. అదే వేదికపై, తమిళనాడులోని హిందూ మతపరమైన మరియు ధర్మాదాయ సంస్థలకు బాధ్యత వహించే పీకే శేఖర్‌బాబు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండడాన్ని దేనికి సంకేతం. సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడమే కూటమి ఉద్దేశమని ఐఎన్‌సీటీ తమిళనాడు అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ చర్యలు భారతదేశంలోని హిందూ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. విపక్ష కూటమి ఇండియా అని పేరు పెట్టుకోవడానికి కనీస నైతిక హక్కు కూడా వీరికి లేదు. 2010 సంవత్సరంలో హిందూ సంస్ధలను లష్కరే తొయిబా సంస్ధతో రాహుల్ గాంధీ పోల్చి మాట్లాడడం అత్యంత దారుణమని’’ పురందేశ్వరి ఈ ట్వీట్‌లో గుర్తు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బదీసే విధంగా ఇండియా కూటమిలోని నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే ఉదయినిధిని సమర్ధిస్తూ కార్తిక్ చిదంబరం చేసిన వ్యాఖ్యలపై దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రంగా మండిపడ్డారు.