Home » Union Cabinet Minister
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రమంత్రి మండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మూడు పథకాలకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి వీటిని విజ్ఞాన ధార పథకంలో విలీనం చేసింది.
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్. డి. కుమార స్వామి ఆదివారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో సిబ్బంది వెంటనే ఆయన్ని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడుతున్నారు. ఆ క్రమంలో ఆయన ముక్కు నుంచి ఒక్కసారిగా రక్తం స్రవించడం ప్రారంభమైంది.
భారత తొలి మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్’ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ఒకరు.. త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్ ) కు వెళ్లనున్నారని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు.
కేంద్ర బడ్జెట్‌లో పశ్చిమ బెంగాల్‌కు నిధుల కేటాయింపులో వివక్ష, రాష్ట్ర విభజన ప్రయత్నాలపై నిలదీస్తానంటూ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన ఆ రాష్ట్ర సీఎం మమత మధ్యలోనే వాకౌట్ చేశారు.
అమెరికాలో భారత రాయబారిగా విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి వినయ్ క్వాత్రా శుక్రవారం నియమితులయ్యారు. ఆయన ఆదివారమే కార్యదర్శిగా పదవీ విరమణ చేయడం గమనార్హం.
నీట్ పరీక్ష వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు తక్షణం స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
టీడీపీ యంగ్ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో మధ్యాహ్నం 01:10 గంటల సమయంలో కేంద్ర పౌర విమానా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దేశంలో అత్యంత పిన్న వయసులో..