Delhi: ఐఎస్ఎస్కు వెళ్లనున్న గగన్యాన్ వ్యోమగామి
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:35 AM
భారత తొలి మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్యాన్’ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ఒకరు.. త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్ ) కు వెళ్లనున్నారని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు.
న్యూఢిల్లీ, జూలై 27: భారత తొలి మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్యాన్’ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ఒకరు.. త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎ్సఎ్స)కు వెళ్లనున్నారని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. నాసాకు అనుబంధంగా పని చేస్తున్న ఆక్సియోమ్ స్పేస్ అనే సంస్థతో ఇస్రో ఈ మేరకు ఒప్పందం చేసుకుందని, దాంట్లో భాగంగా ఐఎ్సఎస్ పర్యటన జరగనుందన్నారు. లోక్సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.