Amit Shah: 18న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు అమిత్ షా
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:19 PM
అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్ ఆదివారం (18వ తేదీ) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్మించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో పాటు పదో బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ క్యాంపులను అమిత్ షా ప్రారంభిస్తారు.
అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ఆదివారం (18వ తేదీ) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పర్యటనకు (Visit) రానున్నారు. కృష్ణా జిల్లా (Krishna Dist.), గన్నవరం (Gannavaram) సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎన్ఐడీఎం (NIDM) ప్రాంగణాలను కేంద్ర హోం మంత్రి ప్రారంభించనున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరానికి వస్తారు. ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారు. 19న ఉదయం ఎన్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తదితరులు పాల్గొంటారు. ప్రారంభోత్సవం తర్వాత అమిత్ షా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
ఈ వార్త కూడా చదవండి..
కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు.. ఎందుకంటే..
విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్మించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో పాటు పదో బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ క్యాంపులను అమిత్ షా ప్రారంభిస్తారు. ఇవి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోనివి కావడంతో ఆయన ప్రత్యేకంగా వస్తున్నారు. ఈ పర్యటన రాజకీయంగా కూడా ఆసక్తి రేపుతోంది. అమిత్ షా పర్యటన కోసం ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా రాజకీయాలను అమిత్ షానే పట్టించుకుంటంటారు. పాలన పరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజీగా ఉంటారు. అయితే అంతిమ నిర్ణయం తీసుకునేది ప్రధాని మోదీనే. పనులన్నీ చక్కబెట్టేది అమిత్ షా. ఏపీ పర్యటనలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ ముగ్గురి మధ్య రాజకీయ చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాగా ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి ఏడు నెలలు గడుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నారు. వైఎస్సార్‌సీపీ నిర్వాకాల కారణంగా ఎన్నో బ్యాక్ లాగ్స్ పెండింగ్‌లో ఉన్నాయని .. వాటిని క్లియర్ చేయాల్సి ఉందని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన అనేక అవకతవకలపై నివేదికలు సిద్ధంగా ఉన్నాయి. అందులో కొన్నింటిలో కేంద్ర దర్యాప్తు సంస్థల ఇన్వాల్వ్ మెంట్ అవసరమని భావిస్తున్నారు. ఈ క్రమంలో అన్నింటిపై ముగ్గురు నేతల మధ్య చర్చలు జరిగే అవకాశముందని తెలియవచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీసత్యసాయి జిల్లాలో అమానుష ఘటన..
గుడివాడలో ప్రాణం తీసిన సిగరెట్...
తిరుమలలో భక్తుల రద్దీ.. వైకుంఠ ద్వారా దర్శనం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News