Union Cabinet: సీఏడీడబ్లూఎం పథకానికి కేబినెట్ ఆమోదం
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:48 PM
ఇరిగేషన్ వాటర్ సప్లయి నెట్‌వర్క్ ఆధునికీకరణకు ఉద్దేశించిన ఎం-సీఏడీడబ్ల్యూఎం పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. వాటర్ అకౌంటింగ్, వాటర్ మేనేజిమెంట్ కోసం ఆధునిక టెక్నాలజీని ఉపయోగించనున్నట్టు తెలిపారు.

న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) సబ్ స్కీమ్ కింద మోడ్రనైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డవలప్‌మెంట్ అండ్ వాటర్ మేనేజిమెంట్ (సీఏడీడబ్ల్యూఎం) పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. 2025-26 సంవత్సరానికి గాను కమాండ్ ఏరియా అభివృద్ధికి కేంద్రం రూ.1,600 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు.
Andhrapradesh Deivision Act: పట్టాలెక్కనున్న అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే
ఇరిగేషన్ వాటర్ సప్లయి నెట్‌వర్క్ ఆధునికీకరణకు ఉద్దేశించిన ఎం-సీఏడీడబ్ల్యూఎం పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రి చెప్పారు. వాటర్ అకౌంటింగ్, వాటర్ మేనేజిమెంట్ కోసం ఆధునిక టెక్నాలజీని ఉపయోగించనున్నట్టు తెలిపారు. దీంతో క్షేత్ర స్థాయిలో నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుందని, వ్యవసాయ ఉత్పత్తులు, ఉత్పాదకత పెరిగి రైతుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. వాటర్ యూజింగ్ సొసైటీలకు హ్యాండ్‌హోల్టింగ్ సపోర్ట్ ఐదేళ్ల పాటు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందువల్ల యువత కూడా ఇరిగేషన్‌లో అధునాతన పద్ధతులను ఉపయోగించుకోవడం ద్వారా వ్యవసాయ సేద్యానికి మక్కువ చూపుతారని అన్నారు. దేశంలోని పలు ఆగ్రోక్లైమేటిక్ జోన్లలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని చేపడతామని అన్నారు. 16వ ఫైనాన్స్ కమిషన్ పీరియడ్‌లోనే 2026 ఏప్రిల్ నుంచి కమాండ్ ఏరియా డవలప్‌మెంట్ అండ్ వాటర్ మేనేజిమెంట్ నేషనల్ ప్లాన్‌ను లాంఛ్ చేస్తామని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..