Share News

Central Cabinet: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. మంత్రి మండలి కీలక నిర్ణయాలు ఇవే..

ABN , Publish Date - Aug 24 , 2024 | 08:03 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రమంత్రి మండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మూడు పథకాలకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి వీటిని విజ్ఞాన ధార పథకంలో విలీనం చేసింది.

Central Cabinet: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. మంత్రి మండలి కీలక నిర్ణయాలు ఇవే..
Union Cabinet

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రమంత్రి మండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మూడు పథకాలకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి వీటిని విజ్ఞాన ధార పథకంలో విలీనం చేసింది. ఈ పధకం కోసం 2021-22 నుంచి 2025-26 వరకు 15వ ఫైనాన్స్ కమిషన్ కాలానికి రూ.10,579 కోట్లను కేటాయించారు. ఈ పథకంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో మానవ సామర్థ్యం పెంపు, పరిశోధనలు, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, సాంకేతికత అభివృద్ధి, విస్తరణపై ప్రత్యేక దృష్టి కేంద్రకరించనున్నారు. అలాగే కేంద్రమంత్రి మండలి కొత్త పెన్షన్ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకంలో 25 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు.


కొత్త పెన్షన్ స్కీమ్..

పెన్షన్ స్కీమ్ విషయంలో మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో పాత పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)కి ఆమోదం తెలిపింది. కనీసం 25 ఏళ్లపాటు పని చేసే ఉద్యోగి యూపీఎస్ స్కీమ్ ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త పథకం కింద 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ పథకం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పదేళ్లు సర్వీసు చేసిన వారికి రూ.10,000 పింఛన్ వస్తుందని తెలిపారు. ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే వారి భార్యకు 60 శాతం పెన్షన్‌ ఇస్తారని, ఈ కొత్త పథకాన్ని రాష్ట్రప్రభుత్వాలు అమలు చేయవచ్చని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పథకంతో ఉద్యోగులపై ఎటువంటి భారం ఉండబోదనక్నారు.


కనీసం 50 శాతం

ఒక ఉద్యోగి కనీసం 25 సంవత్సరాలు పనిచేసినట్లయితే, పదవీ విరమణకు ముందు గత 12 నెలల సగటు జీతంలో కనీసం 50 శాతం పెన్షన్‌గా పొందుతారని కేంద్రమంత్రి తెలిపారు. పింఛనుదారుడు మరణిస్తే, అతని కుటుంబానికి పెన్షన్‌లో 60 శాతం లభిస్తుందన్నారు. ఎన్‌పీఎస్‌లో ఉన్న ఉద్యోగులు యూపీఎస్‌కు వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎన్‌పిఎస్ ప్రారంభించినప్పటి నుండి పదవీ విరమణ చేసిన లేదా పదవీ విరమణ చేయబోతున్న వారందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. దీనికి సంబంధించిన బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. 2004 నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కూడా ఈ ప్రయోజనం పొందుతారని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 24 , 2024 | 08:52 PM