Home » University
విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతులను ఈ నెల 15లోగా నియమిస్తామని విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. 3 రోజుల్లో సెర్చ్ కమిటీల సమావేశాలను పూర్తిచేసి, కొత్త వీసీల నియామక ప్రక్రియను చేపడతామని వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈరోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మోజులో పడి కొందరు చిత్ర విచిత్రమైన పనులకు పాల్పడుతున్నారు. తమ రీల్స్ వైరల్ అవ్వాలని.. లక్షల్లో వ్యూస్, లైక్స్ రావాలన్న ఉద్దేశంతో హద్దుమీరి..
రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీల పదవీకాలం మంగళవారం (21వ తేదీ)తో ముగియనుంది. కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇన్‌చార్జి వీసీలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. యూనివర్సిటీల వీసీల ఎంపిక కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
Telangana: రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వర్సిటీలకు రేపటితో (మంగళవారం) పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం వీసీల పంచాయితీ సెక్రటేరియట్‌కు చేరింది. పాత వైస్ చాన్సలర్లపై ఫిర్యాదులు, కొత్త వీసీ పోస్టుల కోసం బ్యాక్ డోర్ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా వీసీ పోస్టుల కోసం 1300కు పైగా దరఖాస్తులు వచ్చి చేరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఒక్కో వీసీపై రెండంకెల ఫిర్యాదులు నమోదు అయ్యాయి.
కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ తాటికొండ రమే్‌షపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విధుల నుంచి టెర్మినేట్ చేసిన బోధనా సిబ్బందిని నిబంధనలకు విరుద్ధంగా విధుల్లోకి తీసుకోవడం, అక్రమ బదిలీలు, నియామకాలు, నకిలీ ప్రాజెక్టులు ఆమోదించి అక్రమాలకు పాల్పడ్డారంటూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు గతంలో అనేకసార్లు ఆరోపించారు.
Telangana: ఇక్ఫాయి ఘటనపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. లా విద్యార్థిని లేఖ్య వర్ధిని ఒంటిపై గాయాలపై ఇప్పటికీ స్పష్టత రాని పరిస్థితి. వాష్ రూమ్‌లో ఏం జరిగింది అనేది ఇప్పటికీ సస్పెన్సే. అసలు ఘటన ఎలా జరిగిందనే దానిపై యూనివర్సిటీ అధికాలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వేడినీళ్ళ కారణంగానే ఘటన జరిగిందని క్లారిటీ ఇవ్వలేము అంటూనే యాసిడ్ ఎటాక్‌ను యూనివర్సిటీ అధికారులు తోసిపుచ్చారు.
Telangana: శంకర్‌పల్లి ఇక్ఫాయ్ యూనివర్సిటీలో అనుమానాస్పద రీతిలో యువతి శరీరం కాలిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. యూనివర్సిటీలో లా ఫైనల్ ఇయర్ చదువుతున్న లేఖ్య అనే విద్యార్థి యాసిడ్ దాడికి గురైనట్లు అనుమానలు వ్యక్తమవుతున్నాయి. తీవ్రంగా గాయపడిన యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు కొత్త ఉప కులపతులను (వీసీలు) నియమించేందుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, అంబేడ్కర్, జేఎన్‌టీయూహెచ్, జేఎన్‌ఏఎ్‌ఫఏ యూనివర్సిటీల వీసీల పదవి కాలం ఈ నెల 21వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే.
ఒళ్లు గగుర్పొడిచే ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) ఓ యూనివర్సిటీలో మంగళవారం బయటపడింది. వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన మృతదేహాన్ని గుర్తించడంతో.. లెక్చర్లర్లు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కారణం.. ఆ నీటిని రెండు రోజులుగా వాడుతుండటం.
డిగ్రీలో సబ్జెక్టులు మిగిలిపోయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఎస్కేయూ యాజమాన్యం నిర్ణయించింది. దీంతో పరీక్షల కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఊరట లభించింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సప్లిమెంటరీ పరీక్షలకు కొర్రీలు పెడుతూ వచ్చింది. దీంతో డిగ్రీ విద్యార్థులు ఫెయిల్ అయిన ఎస్కేయూ విద్యార్థులు సబ్జెక్టులను పూర్తిచేసుకోలేకపోయారు. ఈ సమస్యపై ఆంధ్రజ్యోతిలో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. అప్పటి వీసీ రామకృష్ణారెడ్డి తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆయన వైసీపీ నాయకుడి తరహాలో ...