TS News: సెక్రటేరియట్‌కు వీసీల పంచాయతీ...
ABN , Publish Date - May 20 , 2024 | 12:06 PM
Telangana: రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వర్సిటీలకు రేపటితో (మంగళవారం) పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం వీసీల పంచాయితీ సెక్రటేరియట్‌కు చేరింది. పాత వైస్ చాన్సలర్లపై ఫిర్యాదులు, కొత్త వీసీ పోస్టుల కోసం బ్యాక్ డోర్ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా వీసీ పోస్టుల కోసం 1300కు పైగా దరఖాస్తులు వచ్చి చేరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఒక్కో వీసీపై రెండంకెల ఫిర్యాదులు నమోదు అయ్యాయి.
హైదరాబాద్, మే 20: రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వర్సిటీలకు (Universities) రేపటితో (మంగళవారం) పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం వీసీల పంచాయితీ సెక్రటేరియట్‌కు (Telangana Secretariat) చేరింది. పాత వైస్ చాన్సలర్లపై ఫిర్యాదులు, కొత్త వీసీ పోస్టుల కోసం బ్యాక్ డోర్ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా వీసీ పోస్టుల కోసం 1300కు పైగా దరఖాస్తులు వచ్చి చేరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఒక్కో వీసీపై రెండంకెల ఫిర్యాదులు నమోదు అయ్యాయి. ఇప్పటికే కాకతీయ యూనివర్సిటీ వీసీపై విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం వర్సెస్ వీసీల పంచాయతీగా పరిస్థితులు మారాయి. వారం రోజుల క్రితం సెక్రటేరియట్‌లోని బుర్ర వెంకటేశంతో తెలుగు యూనివర్సిటీ వీసీ వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.
Rave Party: బెంగళూరులో రేవ్‌పార్టీ.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు
మరోవైపు కొత్త వీసీల నియామకానికి ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. 9 వర్సిటీలకు దాదాపు 14 వందల అప్లికేషన్లు వచ్చి చేరాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు మళ్ళీ జరగకుండా ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈసీ అనుమతి ఇస్తే కొత్త వీసీలను సర్కార్ ప్రకటించనుంది. వీసీల ఎంపికకు సీఎస్ శాంతి కుమారి అధ్యక్షతన సెర్చ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. సెర్చ్ కమిటీ ఫైనల్ చేసిన ముగ్గురి పేర్లలో ఒకరిని వీసీగా గవర్నర్ నియమించనున్నారు.
ఇవి కూడా చదవండి...
PM Modi: ఇరాన్ అధ్యక్షుడు మృతిపై ప్రధాని మోదీ సంతాపం
Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మృతి.. ధృవీకరించిన స్థానిక మీడియా
Read Latest Telangana News And Telugu News