TS News: ఇక్ఫాయి ఘటనలో కొనసాగుతున్న సస్పెన్స్
ABN , Publish Date - May 17 , 2024 | 01:37 PM
Telangana: ఇక్ఫాయి ఘటనపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. లా విద్యార్థిని లేఖ్య వర్ధిని ఒంటిపై గాయాలపై ఇప్పటికీ స్పష్టత రాని పరిస్థితి. వాష్ రూమ్‌లో ఏం జరిగింది అనేది ఇప్పటికీ సస్పెన్సే. అసలు ఘటన ఎలా జరిగిందనే దానిపై యూనివర్సిటీ అధికాలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వేడినీళ్ళ కారణంగానే ఘటన జరిగిందని క్లారిటీ ఇవ్వలేము అంటూనే యాసిడ్ ఎటాక్‌ను యూనివర్సిటీ అధికారులు తోసిపుచ్చారు.
హైదరాబాద్, మే 17: ఇక్ఫాయి ఘటనపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. లా విద్యార్థిని లేఖ్య వర్ధిని ఒంటిపై గాయాలపై ఇప్పటికీ స్పష్టత రాని పరిస్థితి. వాష్ రూమ్‌లో ఏం జరిగింది అనేది ఇప్పటికీ సస్పెన్సే. అసలు ఘటన ఎలా జరిగిందనే దానిపై యూనివర్సిటీ అధికాలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వేడినీళ్ళ కారణంగానే ఘటన జరిగిందని క్లారిటీ ఇవ్వలేము అంటూనే యాసిడ్ ఎటాక్‌ను యూనివర్సిటీ అధికారులు తోసిపుచ్చారు. గతంలో అనారోగ్య సమస్యలు అని చెబుతూనే... అందుకు గాను ఎటువంటి ఆధారాలు లేవు అంటున్న వైనం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లేఖ్య వర్ధిని ఘటనపై యూనివర్సిటీ అధికారులు కనీసం పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం కొత్తపేట ఓమ్ని హాస్పిటల్‌లో లేఖ్య వర్ధిని చికిత్స పొందుతోంది. ఘటనపై క్లూస్ టీమ్స్ చేతిలో ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొకిలా పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
PM Modi: ఈడీ సీజ్ చేసిన నోట్లగుట్టలను ఏం చేస్తామంటే.. మోదీ కీలక వ్యాఖ్యలు
యూనివర్సిటీ వీసీ గణేష్ ఏమన్నారంటే..
‘‘మే 15 న సాయంత్రం మా విద్యార్థికి గాయాలు అయ్యాయి. అమ్మాయిపై వేడి నీళ్ళు పడ్డాయి. యాసిడ్ దాడి జరగలేదు. అమ్మాయి శరీరం 40% కాలిపోయింది. విద్యార్థి తిరుపతి కు చెందిన అమ్మాయి. విద్యార్థి యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ లా చదువుతుంది. మే 15 న సాయంత్రం 7:28 గంటలకు సాయంత్రం రూమ్‌లో నుండి బయటికి వచ్చింది. రూమ్ నుంచి బయటికి రాగానే ర్యాష్ వచ్చిందని అమ్మాయి క్లినిక్‌కు వెళ్ళింది. హాస్టల్ రూమ్‌లో సీసీ కెమెరాలు ఉన్నాయి. పోలీసులు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేవలం వేడి నీళ్ళు కారణంగానే అమ్మాయికు గాయాలు’’ అయ్యాయని వీసీ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి....
Weather Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
Rashmika Mandanna: అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ!
Read Latest Telangana News And Telugu News