Share News

Minister Uttam: గోబెల్‌ను కేటీఆర్‌ మించిపోయారు.. మంత్రి ఉత్తమ్ విసుర్లు

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:21 PM

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మాజీ మంత్రి కేటీఆర్‌ మళ్లీ అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) విమర్శించారు. కాళేశ్వరంపై కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. BRS చర్యల వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

 Minister Uttam: గోబెల్‌ను కేటీఆర్‌ మించిపోయారు.. మంత్రి ఉత్తమ్ విసుర్లు
Minister Uttam Kumar Reddy

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) మళ్లీ అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) విమర్శించారు. కాళేశ్వరంపై కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ చర్యల వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. జలసౌదలో అధికారులతో మంత్రి ఉత్తమ్ సమావేశం అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చించారు. నీటిపారుదల శాఖకు చెందిన సలహాదారులు, కార్యదర్శులు, ఈఎన్సీలు, కింది స్థాయి అధికారులు రివ్యూలో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు చేశారు.

ప్రాజెక్ట్ ప్లాన్ లోపభూయిష్టం

’‘కేటీఆర్‌ జోసెఫ్ గోబెల్‌ రామారావు అనిపేరు పెట్టుకుంటే మంచిది.. గోబెల్‌ను కేటీఆర్‌ మించిపోయారు. హిట్లర్‌ను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తూ.. గ్లోబల్ అవాస్తవాలు చెప్పి ప్రేరేపించారు’‘ అని మంత్రి ఉత్తమ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్ట్ ప్లాన్, నిర్వహణ, నిర్మాణం లోపభూయిష్టంగా చేపట్టారని ఆరోపించారు. కేటీఆర్ మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తుమ్మిడి హెట్టి వద్ద అంబేద్కర్, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేయాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం పనులు తలపెట్టిందని గుర్తుచేశారు. తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో దాని పనులు కొనసాగించారని అన్నారు. ఆ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కూడా అడిగారని గుర్తుచేశారు. రూ.85 వేల కోట్లకు వ్యయం పెంచారని మంత్రి ఉత్తమ్ విమర్శించారు.


కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారు..

‘‘కాళేశ్వరంపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం. గత ప్రభుత్వంలో ప్లాన్, నిర్వహణ, నిర్మాణం లోపభూయిష్టం. రైతులకు వీలైనంత మేలు చేయాలని మేం భావిస్తున్నాం. ఐదుగురు రిటైర్డ్‌ ఇంజినీర్లతో కమిటీ. మేడిగడ్డ ప్రారంభం నుంచే 3 బ్యారేజీల నుంచి లీకేజీలు. మేడిగడ్డ పునాదుల నుంచే సరిగా పనులు జరగలేదు. కేసీఆర్, కేటీఆర్ ఆస్తులు పణంగా పెట్టి ప్రాజెక్టు కట్టలేదు. తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి ప్రాజెక్టు కట్టారు. రాష్ట్ర ప్రజలపై భారం మోపారు. రీ డిజైనింగ్, రీ ఇంజినీరింగ్‌తోనే మేడిగడ్డ కుంగింది. ఆ నిర్వాకం ముమ్మాటికీ మాజీ సీఎం కేసీఆర్‌దే. ఆయన స్వయంగా డిజైన్ చేశానంటూ గొప్పలు చెప్పుకున్నారు. కట్టినప్పుడు, కూలినప్పుడు అధికారంలో ఉన్నది మీరే. కూలిన 47 రోజుల తర్వాత కాంగ్రెస్‌ అధికారం చేపట్టింది. నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేసిన పాపం బీఆర్‌ఎస్‌దే. వాస్తవాలను వక్రీకరించడం గులాబీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. కమీషన్లకు కక్కుర్తిపడి ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టారు. ఇప్పటికైనా గోబెల్ ప్రచారం ఆపండి’’ అని మంత్రి ఉత్తమ్ హితవు పలికారు.


Also Read: Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నేడు కల్వకుర్తి పర్యటన.. జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ..

ప్రాజెక్టులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు

తెలంగాణ ఆర్థిక బడ్జెట్‌లో నీటిపారుదల రంగం మీద స్పష్టత వచ్చిందని తెలిపారు. రూ. 10,820 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కేటాయించిందని వివరించారు. ఎక్కడ పనులు అగాయో.. ఎవరికి డబ్బులు ఇవ్వాలనేది సమీక్షలో చర్చ జరిగిందని వెల్లడించారు. వానకాలంలో కొన్ని చోట్ల వరద వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రాధాన్యత ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పనులు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు.


కక్కుర్తి పడి ప్రాజెక్టులు కట్టారు..

ఈ ఆర్థిక ఏడాది నీటిపారుదల శాఖలో రూ.10,820 కోట్ల పనులకు ఆర్థిక శాఖ అనుమతిచ్చిందని అన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పనుల పురోగతిపై సమీక్షిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు. నీటిపారుదలకు సంబంధించి అన్ని చెరువుల నుంచి జలాశయాల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చర్చించామని అన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో కొత్త చాప్టర్ ప్రారంభించాలని.. అది రైతులకు ప్రజలకు మేలు జరగాలని సమీక్ష చేశామని తెలిపారు.


6.30 లక్షల ఎకరాలకు నీరు..

సంవత్సరంలో 6.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు కొత్త ప్రాజెక్టు చేపట్టామని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం 6 నుంచి 6.30 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇవ్వాలని ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నామని వివరించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి అధికారులతో సమీక్షించి పనుల పరిశీలించాలని చర్చిస్తామని అన్నారు. గత ప్రభుత్వం మాదిరి అధికార దుర్వినియోగం చేయమని కమీషన్‌ల కక్కుర్తి కోసం ప్రాజెక్టులు కట్టమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG News: ఢిల్లీ వరదల్లో తెలంగాణ విద్యార్థిని మృతి.. కేంద్ర మంత్రి దిగ్భ్రాంతి..

Bonalu Festival: భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్.. హాట్ కామెంట్స్..

CM Revanth Reddy: కాంగ్రెస్‌ ఇచ్చిందీ గాడిద గుడ్డే!

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jul 28 , 2024 | 04:10 PM