Home » Uttam Kumar Reddy Nalamada
Telangana: త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాన్ని రేపుతున్నాయి. కేసీఆర్ అహంకరపూరిత వైఖరి వల్లే ఆ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందంటూ మంత్రి అన్నారు. అయితే ఉత్తమ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ప్రజలను భ్రమల్లో పెట్టాలని 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని అంటున్నారని మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంకారం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని గుర్తుచేశారు. ఆ పార్టీ బలం 104 మంది ఎమ్మెల్యేల నుంచి ఆ సంఖ్య 39కి చేరిందని ఉత్తమ్ కుమార్ గుర్తుచేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి షాకింగ్ న్యూస్ ఒకటి చెప్పారు. అదే జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతమవుతుంది. ఇంతకీ ఆ విషయం ఏంటంటారా? త్వరలో 25 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని వెల్లడించారు. కేసీఆర్ అహంకరపూరిత వైఖరి వల్లే ఆ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. నిన్న కరీంనగర్ లో కేసీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడారన్నారు.
రోహింగ్యాలకు తెలంగాణను అడ్డాగా మార్చాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అనుకుంటున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) అన్నారు. కేంద్రం అమలు చేసిన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని ఉత్తమ్ అధికారికంగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.
Telangana:75 ఏళ్ళ స్వాతంత్ర్యం అనంతరం ప్రధాని మోదీ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. మరోసారి మోదీ అధికారంలోకి వస్తే దేశం ఇంకా ప్రమాదంలో పడుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎంలను జైలుకు పంపుతున్నారని, ప్రతిపక్షాలను దర్యాప్తు సంస్థలతో ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి ఎన్నికల ప్రచార ప్రక్రియకు ఇబ్బంది కలిగిస్తున్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోనే లేదని... వాళ్లకు సున్నా సీట్లంటూ వ్యాఖ్యలు చేశారు.
Telangana: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్దమే అని.. ఆయన డిప్రెషన్, ఫస్ట్రేషన్లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. నిన్న కేసీఆర్ స్పీచ్ విన్నాక ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడారు అని అనిపించిందన్నారు. ఒడిపోవడమే కాదు, పార్టీ మిగలదు అనే భయం కేసీఆర్‌లో మొదలైందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు బయలుదేరారు. నిజానికి మధ్యాహ్నం 2గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. నేటి సాయంత్రం సీఈసీ మీటింగ్‌లో రేవంత్ పాల్గొననున్నారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ కానుంది. సీఏం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) కి బీజేపీతోనే పోటీ ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy) అన్నారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...రేపు(శనివారం) నల్గొండ ఎంపీ పరిధి ముఖ్యులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నేడు ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి తెలంగాణ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణలో పెండింగ్ స్థానాలపై చర్చ జరగనుంది. ఇప్పటికే 2 దఫాల్లో 9 మందిని ఏఐసీసీ ప్రకటించింది.
రేషన్ కార్డులు లేకున్నా ప్రభుత్వ పథకాలు అందుతాయని.. ప్రజలు కంగారు పడవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తెలిపారు. గురువారం హుజూర్ నగర్ పట్టణంలోని సీతారామస్వామి గుట్ట సమీపంలో రూ. 74.80 కోట్లతో 2160 సింగిల్ బెడ్ రూం ప్లాట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ ప్రారంభించారు.