Share News

Uttam Kumar: కేసీఆర్ స్పీచ్‌పై మంత్రి ఉత్తమ్ రియాక్షన్ ఇదే...

ABN , Publish Date - Apr 01 , 2024 | 01:13 PM

Telangana: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్దమే అని.. ఆయన డిప్రెషన్, ఫస్ట్రేషన్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. నిన్న కేసీఆర్ స్పీచ్ విన్నాక ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడారు అని అనిపించిందన్నారు. ఒడిపోవడమే కాదు, పార్టీ మిగలదు అనే భయం కేసీఆర్‌లో మొదలైందన్నారు.

Uttam Kumar: కేసీఆర్ స్పీచ్‌పై మంత్రి ఉత్తమ్ రియాక్షన్ ఇదే...

హైదరాబాద్, ఏప్రిల్ 1: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (BRS Chief KCR) మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam kumar Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్దమే అని.. ఆయన డిప్రెషన్, ఫస్ట్రేషన్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. నిన్న కేసీఆర్ స్పీచ్ విన్నాక ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడారు అని అనిపించిందన్నారు. ఒడిపోవడమే కాదు, పార్టీ మిగలదు అనే భయం కేసీఆర్‌లో మొదలైందన్నారు. పొంగనాలకు పోయి జాతీయ పార్టీ అన్నారని.. ఇంత తొందరగా ఏ పార్టీ కుప్ప కూలిపోలేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ (BRS) మిగలదని అన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు తప్ప బీఆర్ఎస్‌లో ఎవరూ మిగలరన్నారు. జనరేటర్ పెట్టుకొని మీటింగ్ పెట్టి, టెక్నికల్ ప్రాబ్లం వస్తే కరెంట్ పోయిందని కేసీఆర్ అబద్దం చెప్పారన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు అవుట్ డేటెడ్ టెక్నాలజీ అని.. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకే భారమన్నారు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవడం లేదన్నారు.

TS Congress: కాకరేపుతున్న ఆ నాలుగు స్థానాలు.. తెరపైకి కొత్త వ్యక్తి


పదేండ్లలో పంట నష్టం జరిగితే కేసీఆర్ రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పచెప్తామని బీఆర్‌ఎస్ చీఫ్ ఒప్పుకున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ - జగన్ కలిసి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ హయాంలో తెలంగాణకు ఎక్కువ ద్రోహం జరిగిందన్నారు. పోలీస్ శాఖను ఎక్కువ మిస్ యూజ్ చేసింది కేసీఆరే అని విమర్శించారు. పోలీసులు న్యూట్రల్‌గా ఉండాలని ఇప్పుడు కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. కరువు వచ్చింది బీఆర్ఎస్ పాలనలోనే అని... దాన్ని సమర్థవంతంగా డీల్ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

Alert: నేటి నుంచి మారే రూల్స్ ఇవే.. తెలుసుకోకుంటే మీకే లాస్.

Arvind Kejriwal: కేజ్రీవాల్ కస్టడీ మళ్లీ పొడిగింపు.. ఇప్పట్లో బయటకు కష్టమేనా?



మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 01 , 2024 | 03:12 PM