TG Politics: 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 06 , 2024 | 05:42 PM
పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంకారం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని గుర్తుచేశారు. ఆ పార్టీ బలం 104 మంది ఎమ్మెల్యేల నుంచి ఆ సంఖ్య 39కి చేరిందని ఉత్తమ్ కుమార్ గుర్తుచేశారు.
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అహంకారం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని గుర్తుచేశారు. ఆ పార్టీ బలం 104 మంది ఎమ్మెల్యేల నుంచి ఆ సంఖ్య 39కి చేరిందని ఉత్తమ్ కుమార్ గుర్తుచేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్దం అని ఉత్తమ్ తేల్చి చెప్పారు. కేసీఆర్ పాస్ పోర్టులు విక్రయించి, కాంట్రాక్టర్లకు బ్రోకర్ల లాగా తాను పనిచేయలేదని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్‌ను బొంద పెట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని వివరించారు. వ్యవసాయశాఖపై అసెంబ్లీలో మాట్లాడిన సమయంలో కేసీఆర్ ఏం చేశారని అడిగారు. ఆ సమయంలో ఇంట్లో పడుకొని, ఇప్పుడు అరుస్తారా అని ఉత్తమ్ విరుచుకుపడ్డారు.
కేసీఆర్ కమీషన్ల కక్కుర్తి
సూర్యాపేటకు వదిలింది సాగునీరు కాదు తాగునీరు మాత్రమేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. కేసీఆర్ కమీషన్ల కక్కుర్తి వల్లే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం ప్రాజెక్టుగా మారిందని విమర్శించారు. ఈ కరువు కేసీఆర్ తెచ్చిందని.. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాగునీటి, విద్యుత్ సమస్య లేదని ఉత్తమ్ వివరించారు. కేసీఆర్ చెప్పే కళ్లబొల్లి కబుర్లను జనం విశ్వసించడం లేదని వివరించారు.
ఇవి కూడా చదవండి:
West Bengal: దీదీతో గొడవకు కారణం ఆ మంత్రే.. బెంగాల్ గవర్నర్ సంచలనం
Maharashtra: కల్యాణ్ నియోజకవర్గం నుంచి మళ్లీ బరిలోకి షిండే కుమారుడు..? ఫడ్నవీస్ ఏమన్నారంటే..?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం