Ponnala Laxmaiah: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలకు పొన్నాల రియాక్షన్ ఇదీ...
ABN , Publish Date - Apr 06 , 2024 | 05:41 PM
Telangana: త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాన్ని రేపుతున్నాయి. కేసీఆర్ అహంకరపూరిత వైఖరి వల్లే ఆ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందంటూ మంత్రి అన్నారు. అయితే ఉత్తమ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ప్రజలను భ్రమల్లో పెట్టాలని 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని అంటున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్, ఏప్రిల్ 6: త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) కాంగ్రెస్‌లో (Congress) చేరబోతున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాన్ని రేపుతున్నాయి. కేసీఆర్ (BRS Chief KCR) అహంకరపూరిత వైఖరి వల్లే ఆ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందంటూ మంత్రి అన్నారు. అయితే ఉత్తమ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Former Minsiter Ponnala Laxmaiah) స్పందించారు. ప్రజలను భ్రమల్లో పెట్టాలని 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని అంటున్నారని మండిపడ్డారు. నీళ్లకు, ఎమ్మెల్యేల చేరికకు ఏం సంబంధమని మాజీ మంత్రి ప్రశ్నించారు.
Delhi Liquor Scam: దిల్లీ మద్యం కేసు.. మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు..
శనివారం పొన్నాల మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు గోదావరి జలాలపై అవగాహన లేదని ఉత్తమ్ అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బాధ్యత లేకుండా పారిపోయింది ఎవరో తెలియదా? అని ప్రశ్నించారు. మంత్రుల మాటల్లో ఆవేశం, అవగాహన లోపం, అనుభవ రాహిత్యం ఉన్నాయన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాకు, సొంత ఊరికి వచ్చే ప్రాజెక్టు గురించి ఏనాడైనా మాట్లాడారా అని నిలదీశారు. మేడిగడ్డ ఆనకట్ట వద్ద సమస్య ఉంటే... అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి ఎందుకు ఎత్తిపోయలేదని అడిగారు. అన్నారం, సుందిళ్ల లోని నాలుగు టీఎంసీలు ఎత్తిపోయకుండా కిందకు ఎందుకు కిందకు వదిలారని మాజీ మంత్రి నిలదీశారు. తప్పుడు సమాచారంతో నీచ రాజకీయాలకు పాల్పడిన వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తుపాకుల గూడెం ద్వారా 48 టీఎంసీలు దిగువకు వదిలారన్నారు. దేవాదుల మోటార్లు నడిపి నీటిని ఎందుకు ఎత్తిపోయలేదని పొన్నా లక్ష్మయ్య ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
AP News: అందుకే పింఛన్ల పంపిణీ ఆలస్యం... నిమ్మగడ్డ రమేష్ కీలక వ్యాఖ్యలు
Rajnath Singh: ఉగ్రవాదులు పాక్ పారిపోయినా విడిచిపెట్టం: రాజ్‌నాథ్ హెచ్చరిక
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...