Share News

Uttamkumar Reddy: లోక్‌సభ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ మిగలదు.....

ABN , Publish Date - Apr 03 , 2024 | 04:50 PM

Telangana:75 ఏళ్ళ స్వాతంత్ర్యం అనంతరం ప్రధాని మోదీ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. మరోసారి మోదీ అధికారంలోకి వస్తే దేశం ఇంకా ప్రమాదంలో పడుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎంలను జైలుకు పంపుతున్నారని, ప్రతిపక్షాలను దర్యాప్తు సంస్థలతో ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి ఎన్నికల ప్రచార ప్రక్రియకు ఇబ్బంది కలిగిస్తున్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోనే లేదని... వాళ్లకు సున్నా సీట్లంటూ వ్యాఖ్యలు చేశారు.

Uttamkumar Reddy: లోక్‌సభ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ మిగలదు.....

సూర్యాపేట, ఏప్రిల్ 3: 75 ఏళ్ళ స్వాతంత్ర్యం అనంతరం ప్రధాని మోదీ (PM Modi) హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. మరోసారి మోదీ అధికారంలోకి వస్తే దేశం ఇంకా ప్రమాదంలో పడుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎంలను జైలుకు పంపుతున్నారని, ప్రతిపక్షాలను దర్యాప్తు సంస్థలతో ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ (Congress) అకౌంట్స్ ఫ్రీజ్ చేసి ఎన్నికల ప్రచార ప్రక్రియకు ఇబ్బంది కలిగిస్తున్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పోటీలోనే లేదని... వాళ్లకు సున్నా సీట్లంటూ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ మిగలదన్నారు. 13 -14 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఉనికికి ప్రమాదం వచ్చిందని కాంగ్రెస్‌పై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vijender Singh: బీజేపీలో చేరిన బాక్సర్ విజేందర్ సింగ్


మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 24 గంటలు సప్లై , డిమాండ్ పెరిగినా విద్యుత్ కోతలు ఉండవన్నారు. కరువు బీఆర్ఎస్ హయాంలోనే మొదలైందన్నారు. జలాశయాల్లో నీళ్లు లేవని 2 జూలై 2023 నే గుర్తించారని.. పదేళ్ళలో మీరు చేయనివి తాము 100 రోజులో చేశామన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఫోన్ టాపింగ్ అస్త్రం ఉపయోగించారని విమర్శించారు. ఫోన్ టాప్పింగ్ కి పాల్పడి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి...

BJP: అధికార పార్టీ సేవలో టీటీడీ ఈవో... బీజేపీ నేత సంచలన ఆరోపణలు

AP Politics: ముస్లింలను వైసీపీ రెచ్చగొడుతోంది.. కిరణ్‌కుమార్‌రెడ్డి ఫైర్


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Apr 03 , 2024 | 04:50 PM