Home » Uttarakhand
ఎన్నికల నగారా మోగిందంటే చాలు.. రాజకీయ పార్టీలు వెంటనే ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తాయి. చిన్న చిన్న మారుమూల ప్రాంతాలకు వెళ్లి మరీ.. తమకే ఓటు వేయాలని ఓటర్లను కోరుతారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. దేశవ్యాప్తంగా పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి.
కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు అదుపు తప్పి దాదాపు 200 మీటర్ల లోతులో ఉన్న గుంతలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 10 మందిలో 8 మంది మృత్యువాత చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్(Uttarakhand)లోని నైనిటాల్(Nainital district) జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లో లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రుద్రపూర్లో మంగళవారంనాడు జరిగిన 'విజయ్ శంఖనాథ్ ర్యాలీ'లో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఒక శంఖాన్ని బహూకరించారు.
ఉత్తరాఖండ్(Uttarakhand)లో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. ఉదమ్ సింగ్ నగర్లోని నానక్మట్టా సాహిబ్ గురుద్వారా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను ఈరోజు తెల్లవారుజామున బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు గురుద్వారా ఆవరణలో కాల్చి చంపారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి.
దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. తొలిదశలో 102 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఉత్తరాఖండ్లోని మొత్తం ఐదు స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాఖండ్లో బీజేపీ క్లీన్స్వీప్ చేసింది. వరుసగా మూడోసారి క్లీన్ స్వీప్పై కమలం పార్టీ గురి పెట్టింది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఫిబ్రవరి 7న ఆమోదించిన ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. మతంతో సంబంధం లేకుండా వివాహాలు, విడాకులు, భూములు, ఆస్తులు, వారసత్వ చట్టాలు అందరికీ ఒకేరీతిలో వర్తించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టగా, బిల్లు సభామోదం పొందింది.
Dehradun News: కేదార్నాథ్ వెళ్లాలనుకునే భక్తులకు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ(BKTC) శుభవార్త చెప్పింది. మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు కేదార్నాథ్ ఆలయాన్ని(Kedarnath Dham) తెరవనున్నట్లు ప్రకటించారు. మహాశివరాత్రి(Mahashivratri) సందర్భంగా బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ఈ ప్రకటన చేసింది. మే 10వ తేదీన భక్తుల సందర్శనార్థం ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని తెలిపారు.
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం దాదాపు తెల్లవారు జామున 4.30 వరకు కొనసాగింది. బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. ఇక ఈ సమావేశంలో దాదాపు 16 రాష్ట్రాల నుంచి లోక్సభ అభ్యర్థుల పేర్లను చర్చించి ఖరారు చేశారని సమాచారం. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తొలుత ఉత్తరప్రదేశ్ అభ్యర్థుల పేర్లపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తి ధ్వంసం కేసుల్లో జరిగిన ఆస్తి నష్టాన్ని ఎవరు భరిస్తారనేదానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అలాంటి కేసుల్లో ఆస్తి నష్టం పూర్తి భారాన్ని నిందితులపై పెట్టాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ హింస ఘటనలో కీలక సూత్రధారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 8న నైనిటాల్ జిల్లాలోని హల్ద్వానీలో హింస చెలరేగింది. బంభూల్పురా ప్రాంతంలో ఒక మసీదు, మదర్సాను కూల్చేశారు.