Uttarakhand: ఉత్తరాఖండ్‌లో పట్టపగలే దారుణ హత్య.. నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా చీఫ్ హతం..
ABN , Publish Date - Mar 28 , 2024 | 01:00 PM
ఉత్తరాఖండ్(Uttarakhand)లో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. ఉదమ్ సింగ్ నగర్‌లోని నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్‌ను ఈరోజు తెల్లవారుజామున బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు గురుద్వారా ఆవరణలో కాల్చి చంపారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి.
ఉత్తరాఖండ్(Uttarakhand)లో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. ఉదమ్ సింగ్ నగర్‌లోని నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్‌ను ఈరోజు తెల్లవారుజామున బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు గురుద్వారా ఆవరణలో కాల్చి చంపారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. ఉదయం 6:30 గంటల సమయంలో గురుద్వారా ప్రాంగణంలో కుర్చీపై బాబా తర్సేమ్ సింగ్ కూర్చుని ఉండగా.. బైక్‌పై వచ్చిన దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు నానక్‌మట్టా గురుద్వారాలోకి ప్రవేశించి కర్ సేవా ప్రముఖ్ బాబా టార్సేమ్ సింగ్‌ను కాల్చిచంపారు. ఈ ఆలయం ధమ్ సింగ్ నగర్ జిల్లాలో రుద్రపూర్-తనక్‌పూర్ మార్గంలోని సిక్కుల పుణ్యక్షేత్రంగా ఉంది. బాబా తర్సేమ్ సింగ్‌ను ఖతిమాలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారని ఉధమ్ సింగ్ నగర్ ఎస్‌ఎస్‌పి మంజు నాథ్ తెలిపారు.
Taj Mahal: తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని కోర్టులో కొత్త పిటిషన్ దాఖలు
పోలీసుల దర్యాప్తు
హత్యపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరాఖండ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని నానక్‌మట్టా ప్రాంతంలో అదనపు పోలీసు సిబ్బందిని మోహరించామని, శాంతిభద్రతలను కాపాడేందుకు సహకరించాలని సిక్కు సమాజానికి పోలీసులు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామన్నారు. ఉదయం 7గంటలకు తమకు సమాచారం అందిందని ఉదయం 6:15 నుంచి 6:30 గంటల మధ్య, ఇద్దరు ముసుగు ధరించిన దుండగులు నానక్‌మట్టా గురుద్వారాలోకి ప్రవేశించి కాల్పులకు పాల్పడ్డారన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..