Home » Vande Bharat Express
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతో తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైళ్లలో ఆహారం విషయంలో తరచూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. దుర్వాసనతో పాటు భోజనంలో కీటకాలు, ఇతర పురుగులు రావడం వంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ ప్రయాణికుడికి సర్వ్ చేసిన యోగర్ట్(Yogurt)లో ఫంగస్ (Fungus) కనిపించింది.
వందే భారత్.. ఈ రైలు గురించి తెలియని వారెవరూ ఉండరేమో. భారతీయ రైల్వేలో ఆధునాతన సదుపాయాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ రైలులో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఆటోమేటిక్ క్లీనింగ్ ప్లాంట్లలో వందేభారత్ రైళ్లను శుభ్రపరిచే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వందేభారత్(Vande Bharath) రైళ్ల సంఖ్యను 82కి పెంచామని, ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా మార్గాల్లో ఈ రైళ్ల వేగాన్ని గంటకు 160 కి.మీ.ల మేర పెంచేందుకు పనులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది.
రైళ్లలో అందించే ఆహారం నాణ్యతపై తరచుగా ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. ఎన్ని ఫిర్యాదులు అందినా మళ్లీ మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉంటాయి.
ప్రయాణికులకు ఉత్తమమైన, మెరుగైన సేవలు అందించేందుకు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ.. ఇది మాత్రం ఏదో ఒక ఫిర్యాదుతో వార్తల్లోకి ఎక్కుతోంది. ముఖ్యంగా.. ఈ రైలులో వడ్డించే ఆహారం విషయంలో ప్రయాణికుల నుంచి విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి
చెన్నై - మైసూరు(Chennai - Mysore)ల మధ్య వారానికోసారి నడిచే వందేభారత్ స్పెషల్ రైలు సేవలను పొడిగిస్తూ నైరుతి రైల్వే నిర్ణయం తీసుకుంది.
దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express) రైలులో ఇటివల కొంత మంది ప్రయాణికులు అసంతృప్తికి లోనయ్యారు. తమకు అందించిన ఆహారం పాడైపోయి దుర్వాసనతో ఉందని ఆ ప్రయాణికులు పేర్కొన్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం చెన్నై ఎగ్మూర్ - నాగర్‌కోయిల్ మధ్య ప్రత్యేక వందే భారత్ రైళ్లు(Special Vande Bharat trains) నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
కోయంబత్తూర్-బెంగుళూరు(Koimbatore-Bangalore) మధ్య వందే భారత్ ట్రయల్ రన్ బుధవారం ఉదయం నిర్వహించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ పథకంలో భాగంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో నడుస్తున్నాయి.