Share News

Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో భోజనం డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రయాణికుల విజ్ఞప్తి..కారణమిదే

ABN , Publish Date - Jan 11 , 2024 | 05:33 PM

దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express) రైలులో ఇటివల కొంత మంది ప్రయాణికులు అసంతృప్తికి లోనయ్యారు. తమకు అందించిన ఆహారం పాడైపోయి దుర్వాసనతో ఉందని ఆ ప్రయాణికులు పేర్కొన్నారు.

Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో భోజనం డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రయాణికుల విజ్ఞప్తి..కారణమిదే

దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express) రైలులో ఇటివల కొంత మంది ప్రయాణికులు అసంతృప్తికి లోనయ్యారు. తమకు అందించిన ఆహారం పాడైపోయి దుర్వాసనతో ఉందని ఆ ప్రయాణికులు పేర్కొన్నారు. 22416లో NDLS నుంచి BSBకి వరకు ఉన్న ప్రయాణికులకు వడ్డించిన ఆహారం సరిగా లేదని పక్కన పెట్టారు. ఆ క్రమంలో తమకు ఫుడ్ కోసం వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని X వినియోగదారు ఆకాష్ కేశరి సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పోస్ట్ చేస్తూ కోరారు. అంతేకాదు ఈ విక్రేతలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ పేరును పాడు చేస్తున్నారని రాసుకొచ్చారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: ఈ బామ్మ తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. చేతులో చేసిన స్వెట్టర్‌ను చిన్న ట్రిక్‌తో ఎలా మార్చిందంటే..


ఇక అందులోని వీడియోలో కొంత మంది ప్రయాణికులు(passengers) వారి ఆహారాన్ని తీసుకెళ్లమని రైల్వే సిబ్బందిని కోరుతున్నారు. మరో చిన్న క్లిప్‌లో సబ్జీ వాసన వస్తోందని, పప్పు చెడిపోయిందని ఓ వ్యక్తి చెబుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ పోస్ట్‌ను జనవరి 6న రాత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..ఇప్పటికే 5400 మందికిపైగా వీక్షించారు. మరికొంత మంది కామెంట్లు కూడా చేశారు. అలాంటి విక్రేతలను కఠినంగా శిక్షించాలని ఓ వ్యక్తి పేర్కొన్నారు. మరొక వ్యక్తి రాజధానిలో కూడా ఇదే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 11 , 2024 | 05:42 PM