Home » Varanasi
వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సవాలు చేసే పొలిటికల్ సూపర్స్టార్ల జాబితాను విపక్ష ఇండియా కూటమి పరిశీలిస్తోంది. సీట్ల షేరింగ్ వ్యవహారంపై ఇండియా కూటమి మంగళవారం సమావేశమైన మరుసటి రోజే ఈ జాబితాపై కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. నితీష్ కుమార్, ప్రియాంక గాంధీ వాద్రా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
అయోధ్య శ్రీరామునిపై ఉన్న తన భక్తిని ఓ వజ్రాల వ్యాపారి నెక్లెస్ రూపంలో చాటుకున్నాడు. రసేష్ జ్యువెల్స్ డైరెక్టర్ కౌశిక్ కాకడియా అనే వజ్రాల వ్యాపారి అద్భుతమైన హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ 5000 అమెరికన్ వజ్రాలను ఉపయోగించి రామాలయం థీమ్‌పై నెక్లెస్‌ను తయారు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో జరుపుతున్న రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా వారణాసి నుంచి ఢిల్లీకి మరో కొత్త వందేభారత్ రైలును ప్రధాని సోమవారంనాడు ప్రారంభించారు. వారణాసి-ఢిల్లీ మార్గంలో ఇప్పటికే ఒక రైలు రాకపోకలు సాగిస్తుండగా ఇది రెండవది.
జ్ఞానవాపి మసీదుపై శాస్త్రీయ సర్వే నివేదికను భారత పురావస్తు శాఖ సోమవారంనాడు వారణాసి జిల్లా కోర్టుకు సమర్పించింది. సీల్డ్ కవర్లో ఈ నివేదికను అర్కియాలజికల్ సర్వే స్టాండింగ్ కౌన్సిల్ అమిత్ శ్రీవాత్సవ అందజేశారు.
ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
కన్యాకుమారి, వారణాసి మధ్య నడిచే కాశీ తమిళ్ సంగమం ఎక్స్‌ప్రెస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. తమిళనాడు, వారణాసి ప్రజల మధ్య ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.
రెండ్రోజుల పర్యటనలో భాగంగా వారణాసిలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదివారంనాడు తన నియోజకవర్గంలో రోడ్‌షో సందర్భంగా ఒక అంబులెన్స్‌కు మార్గం కల్పించేందుకు తన కాన్వాయ్‌ను కొద్ది నిమిషాలు ఆపారు. దీంతో అంబులెన్స్ ఎలాంటి ఆటకం లేకుండా ముందుకు వెళ్లిపోయింది.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్‌లోని సూరత్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించనున్నారు. ఉదయం 10:45 గంటలకు సూరత్ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వారణాసి(Varanasi)లో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్(Shri Kashi Vishwanath Dham) ఆలయాన్ని గడిచిన రెండేళ్లలో రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు.
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్ శాస్త్రీయ సర్వే నివేదికను సమర్పించేందుకు మరో 21 రోజులు గడువు కావాలని భారత పురావస్తు శాఖ వారణాసి జిల్లా కోర్టును కోరింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28వ తేదీన నివేదికను ఏఎస్ఐ సమర్పించాల్సి ఉంది.