Modi: టెర్మినల్ భవనం నుంచి కాశీ తమిళ సంగమం వరకు.. నేడు మోదీ ప్రారంభించనున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవే!
ABN , Publish Date - Dec 17 , 2023 | 10:35 AM
ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్‌లోని సూరత్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించనున్నారు. ఉదయం 10:45 గంటలకు సూరత్ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్‌లోని సూరత్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించనున్నారు. ఉదయం 10:45 గంటలకు సూరత్ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. ఆ తరువాత ఉదయం 11:15 గంటలకు మోదీ సూరత్ డైమండ్ బోర్స్‌ను ప్రారంభిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన ఒక పత్రికా ప్రకటన తెలిపింది. అనంతరం వారణాసి వెళ్లనున్న మోదీ మధ్యాహ్నం 3:30 గంటలకు విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రలో పాల్గొంటారు. సాయంత్రం 5:15 గంటలకు నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం 2023ని మోదీ ప్రారంభిస్తారు. టెర్మినల్ భవనంలో 1,200 మంది దేశీయ ప్రయాణికులు, 600 మంది విదేశీ ప్రయాణీకులు రద్దీ సమయాల్లో ఉండొచ్చు. పీక్ అవర్ కెపాసిటీ 3000 మంది ప్రయాణికులకు పెంచడానికి వార్షిక నిర్వహణ సామర్థ్యం 55 లక్షలకు వరకు కానుంది. టెర్మినల్ భవనాన్ని సూరత్ నగరం స్థానిక సంస్కృతి, వారసత్వంతో నిర్మించారు.
కొత్త టెర్మినల్ భవనం డబుల్-ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, తక్కువ వేడిని పొందే డబుల్-గ్లేజింగ్ యూనిట్, రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి కర్మాగారం వంటి లక్షణాలను కలిగి ఉంది. ల్యాండ్‌స్కేపింగ్, సోలార్ పవర్ ప్లాంట్ కోసం రీసైకిల్ చేసిన నీటిని ఉపయోగించనున్నారు.అంతర్జాతీయ వజ్రాలు, అభరణాల వ్యాపారానికి ప్రపంచంలోనే అతి పెద్ద కేంద్రంగా సూరత్‌లోని డైమండ్ బోర్స్ నిలువనుంది. ఇది వజ్రాలు, అభరణాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా ఉంటుంది. వారణాసిలోని కటింగ్ మెమోరియల్ స్కూల్ గ్రౌండ్స్‌లో విక్షిత్ భారత్ సంకల్ప యాత్రలో మోదీ పాల్గొంటారు. ఈ క్రమంలో ప్రధాని ఆవాస్, పీఎం స్వానిధి, పీఎం ఉజ్వల వంటి వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని సంభాషించనున్నారు.
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దార్శనికతకు అనుగుణంగా ప్రధాన మంత్రి నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం 2023ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కన్యాకుమారి-వారణాసి తమిళ సంగమం రైలును కూడా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇక సోమవారం ఉదయం 10:45 గంటలకు ప్రధానమంత్రి స్వర్వేద్ మహామందిర్‌ను సందర్శించనున్నారు. ఆ తర్వాత ఉదయం 11:30 గంటలకు బహిరంగ కార్యక్రమంలో ప్రారంభోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంటలకు ప్రధాని మోదీ విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రలో పాల్గొంటారు. ఆ తర్వాత ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో, మధ్యాహ్నం 2:15 గంటలకు రూ.19,150 కోట్లు విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.