Share News

Devotees: కాశీ విశ్వనాథ్ ధామ్ ఆలయాన్ని రికార్డు స్థాయిలో దర్శించుకున్న భక్తులు.. రెండేళ్లలో ఎందరంటే?

ABN , First Publish Date - 2023-12-10T09:11:49+05:30 IST

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వారణాసి(Varanasi)లో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్(Shri Kashi Vishwanath Dham) ఆలయాన్ని గడిచిన రెండేళ్లలో రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు.

Devotees: కాశీ విశ్వనాథ్ ధామ్ ఆలయాన్ని రికార్డు స్థాయిలో దర్శించుకున్న భక్తులు.. రెండేళ్లలో ఎందరంటే?

లఖ్ నవూ: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వారణాసి(Varanasi)లో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్(Shri Kashi Vishwanath Dham) ఆలయాన్ని గడిచిన రెండేళ్లలో రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) 2021 డిసెంబర్ లో కాశీ విశ్వనాథ్ ధామ్ ఆలయ కారిడార్ ని ప్రారంభించారు. అప్పటి నుంచి దేశంలోని ప్రముఖ యాత్ర స్థలాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది.

భక్తుల సంఖ్య అనేక రెట్లు పెరిగిందని అధికారులు తెలిపారు. రెండేళ్లలో ఇప్పటివరకు సుమారు 12 కోట్ల 90 లక్షల మంది భక్తులు శివుడిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. సావన్ నెలల్లోనే కోటి 60 లక్షల మందికిపైగా భక్తులు దర్శనానికి వచ్చారట. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 5.3 కోట్ల మంది దర్శనానికి వచ్చారు.


“శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ యాత్రను 13 డిసెంబర్ 2021న ప్రారంభించాం. అప్పటి నుండి 6 డిసెంబర్ 2023 వరకు 12 కోట్ల 92 లక్షల 24 వేల మంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. డిసెంబరు చివరి నాటికి ఈ సంఖ్య 13 కోట్లకు చేరుకుంటుందని అనుకుంటున్నాం" అని ఆలయ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ కుమార్ వర్మ తెలిపారు. కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ గత రెండేళ్లలోపర్యాటకులకు, భక్తులకు సౌకర్యాలను పెంచిందని సునీల్ చెప్పారు.

ఇంతకు ముందు ఆలయ విస్తీర్ణం 3000 చదరపు అడుగులు మాత్రమే ఉండేదని 2021లో దీనిని సుమారు 5 లక్షల చదరపు అడుగులకు పెంచామన్నారు. తద్వారా ఒకేసారి ఆలయ ప్రాంగణంలో 50,000 - 75,000 మంది భక్తులను అనుమతించడం సాధ్యపడుతోందని తెలిపారు. వేసవి, చలి, వాన కాలాల సమయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు జర్మన్ హ్యాంగర్లు, చాపలు, కూలర్లు, తాగునీరు, వీల్ చైర్లు, వైద్య సదుపాయాలు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Updated Date - 2023-12-10T09:12:28+05:30 IST