Home » Vijayawada
ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఒకటి రెండు గంటలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత నాన్ స్టాప్‌గా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాల థాటికి విజయవాడ విల విల్లాడుతున్న సంగతి తెలిసిందే..
అమరావతి: ప్రకాశం బ్యారేజీపై కుట్రలో మరో కోణం వెలుగు చూసింది. బ్యారేజీ స్లూయిజ్ గేట్ల చైన్లు తొలగించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 10 గేట్ల చైన్లు తొలగించడాన్ని చూసి ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. బ్యారేజీకి ఒకవైపు 6, మరోవైపు 4 స్లూయిజ్ గేట్లు ఉంటాయి. బ్యారేజి నీటి మట్టం తగ్గిన సమయంలో గేట్ల కింద ఉన్న వ్యర్థాలను బయటకు పంపేందుకు వాటిని ఆపరేట్ చేస్తారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి ఎక్కువ వరదుల వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్‌కు వివరించానని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు గవర్నర్‌ను కలిశారు. వరదలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.
బంగాళాఖాతంలో మరోసారి ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇప్పటికే వర్షాలు, వరదలతో అల్లకల్లోలంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోసారి వరదలు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
బెజవాడ వాసులను బుడమేరు (Budameru) ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు..! విజయవాడ (Vijayawada) పట్ల బుడమేరు.. పగ.. మేరులా మారి పట్టి పీడిస్తోంది..! ఒకటా రెండా సుమారు పది రోజులుగా ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది..! హమ్మయ్యా.. వానలు, వరద తగ్గాయ్ అనుకునే లోపే మళ్లీ బుడమేరు భయపెడుతోంది..!
వరదల సమయంలో గండ్లు పూడ్చేందుకు ఏపీ జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన కృషి అందరినీ ఆకట్టుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మూడు గంటల పాటు పర్యటించారు. భారీ వర్షం పడుతున్నా.. వరద నీటిలో ఆయన పర్యటించారు. భవానీపురం, సితార సెంటర్, చిట్టి నగర్, ఎర్రకట్ట, మ్యాంగో మార్కెట్, సింగ్ నగర్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు.
Andhrapradesh: ప్రకాశం బ్యారేజీకి బోట్స్ ఢీకొన్న వ్యవహారంపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే ఉద్దేశపూర్వకంగా బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టడం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో బ్యారేజీని ఢీకొన్న బోట్లు ఎవరివి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కూటమి సర్కార్.. అనుకున్నది సాధించింది. వరదలతో బెజవాడ ప్రజలను గజ గజ వణికించిన బుడమేరు పనులు విజయవంతంగా ముగిసాయి...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. వారం రోజులపాటు కురిసిన వర్షాలు ప్రజలకు నీడ లేకుండా చేశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో బుడమేరు పొంగి విజయవాడ వాసులను ముంచెత్తింది. ఇళ్లలోకి పెద్దఎత్తున నీరు చేరి దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. అయితే వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.