Share News

Amaravati: జాగ్రత్తగా ఉండాలి.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు..

ABN , Publish Date - Sep 08 , 2024 | 10:13 PM

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి ఎక్కువ వరదుల వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్‌కు వివరించానని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు గవర్నర్‌ను కలిశారు. వరదలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.

Amaravati: జాగ్రత్తగా ఉండాలి.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు..
CM Chandrababu

అమరావతి, సెప్టెంబర్ 08: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి ఎక్కువ వరదుల వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్‌కు వివరించానని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు గవర్నర్‌ను కలిశారు. వరదలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ విషయాన్ని సీఎం మీడియాకు వివరించారు. ప్రకాశం బ్యారేజీ కట్టిన తరువాత పైన ఎన్నో ప్రాజెక్టుకు వచ్చాయన్నారు. రాయలసీమకు నీరు ఇచ్చినా.. ఫ్లడ్స్ కంట్రోల్ అవలేదన్నారు. దీనంతటికీ కారణం వాతావరణంలో మార్పులు, క్లౌడ్ బరస్ట్ అని చెప్పుకొచ్చారు సీఎం. రూ. 2 లక్షల కుటుంబాలు, 6 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు.


అధికార యంత్రాంగం మొత్తం పునరావాస కార్యక్రమాలు ముమ్మరం చేశారని.. బెస్ట్ సర్వీసెస్ ఇచ్చారని సీఎం ప్రశంసించారు. గవర్నర్ కూడా దీనిపై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. తొందరలోనే సాధారణ పరిస్థితిలు ఏర్పాటు చేస్తామని గవర్నర్‌కు వివరించామన్నారు. అల్పపీడన ద్రోణి వల్ల వర్షాలు మళ్లీ పడుతున్నాయన్నారు. ఉత్తరాంధ్రలో ఏఎస్ఆర్ రిజర్వాయర్‌కు ఎక్కువగా నీళ్లు వస్తాయన్నారు.పిఠాపురం ప్రాంతంపై ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో పైన దృష్టిపెట్టాలని అధికారులకు సూచించామన్నారు సీఎం.


చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పై నుంచి వస్తున్న వరద నీరు, సబ్‌మెర్జ్ అయ్యే ప్రాంతాలను చూసి యాప్ ద్వారా చెపుతున్నారన్నారు. వరద నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సీఎం సూచించారు. ఇప్పటి వరకు 97.70 లక్షల ఆహర ప్యాకెట్లు అందించామన్నారు. ఆదివారం నాడు 62 మెట్రిక్ టన్నుల కూరగాయలు పంపిణీ చేశామని సీఎం చెప్పారు. మొత్తంగా 160 మెట్రిక్ టన్నుల కూరగాయలు పంపిణీ చేశామని.. 120 లక్షల లీటర్లు వాటర్‌ను అందించామని సీఎం చంద్రబాబు తెలిపారు.


వాటర్ కనెక్షన్‌లు 12,167 కనెక్షన్ లు ఇచ్చామని.. ఇంకా అవి అలాగే ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కొండ ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్ వచ్చే అవకాశం ఉందని అలర్ట్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. నందివాడ మండలం మొత్తం నీరు వచ్చే పరిస్థితి ఉందన్నారు. లక్షా 10 వేల కుటుంబాలకు రేషన్ ఇచ్చామమని సీఎం తెలిపారు. 27 వేల ఇళ్లను ఫైర్ ఇంజిన్లు క్లీన్ చేశాయన్నారు. 368 కిలో మీటర్లు క్లీన్ చేశామని.. దీని వల్ల శానిటేషన్ పరిస్థితి మెరుగైందన్నారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉంటారన్నారు.

Updated Date - Sep 08 , 2024 | 10:13 PM