Prakasam Barrage: ఆ బోట్లు మాజీ ఎంపీ సురేష్ అనుచరులవా?.. పోలీసుల దర్యాప్తు ప్రారంభం
ABN , Publish Date - Sep 07 , 2024 | 04:44 PM
Andhrapradesh: ప్రకాశం బ్యారేజీకి బోట్స్ ఢీకొన్న వ్యవహారంపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే ఉద్దేశపూర్వకంగా బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టడం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో బ్యారేజీని ఢీకొన్న బోట్లు ఎవరివి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్ 7: ప్రకాశం బ్యారేజీకి (Prakasam Barrage) బోట్స్ ఢీకొన్న వ్యవహారంపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే ఉద్దేశపూర్వకంగా బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టడం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో బ్యారేజీని ఢీకొన్న బోట్లు ఎవరివి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరులకు చెందిన బోట్స్‌గా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూడు బోట్స్‌కు కలిపి ఒకే గొలుసు వేసి కట్టడంతోనే ఒకే చోటకి వచ్చి ఢీకొన్నాయని... పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.
Viral Video: ఆర్టీసీ బస్సును ఆపి.. యువకుడి వింత నిర్వాకం.. వీడియోపై సజ్జనార్ ఏమన్నారంటే..
ఆ పడవలు వైసీపీ నాయకులవే అంటూ...
కాగా.. ప్రకాశం బ్యారేజీ బోట్స్ ఢీకొన్న వ్యవహారంలో కుట్ర కోణం దాగి ఉందని.. దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ మంత్రి కొల్లు రవ్రీంద్ర సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టిన బోట్లని కూడా వైసీపీ నాయకులకు చెందినవిగా అనుమానాలు ఉన్నాయన్నారు. ఉద్దేశపూర్వకంగానే బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీ కొన్నట్లు సమాచారం ఉందన్నారు. ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొన్న పడవలు కూడా వైసీపీ నాయకులకు చెందినవి ప్రజలు చెప్తున్నారన్నారు. ప్రకాశం బ్యారేజిని ఉద్దేశపూర్వకంగానే ఒకే చోట ఢీకొనే విధంగా చేశారని మండిపడ్డారు. ఇసుక తోలే హెవీ పడవలను తీసుకొచ్చి వదిలారన్నారు.
Ganesh Chaturthi: ముంబైలో లాల్‌బాగ్చా రాజా గణపతికి ఉద్ధవ్ పూజలు
బ్యారేజీని ఢీ కొట్టిన పడవలకు ఎటువంటి అనుమతులు కూడా లేవని తెలుస్తుందన్నారు. పడవల మీద వైసీపీ రంగులే ఉన్నాయన్నారు. కుట్రపూరితంగానే జరిగిందంటూ వ్యాఖ్యలు చేశారు. బ్యారేజీకి జరగరాని డామేజ్ జరిగి ఉంటే పెద్ద ఉపద్రవం వచ్చేదని... దీన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలన్నారు. గతంలో వైసీపీ నాయకులు మట్టిని అమ్ముకోబట్టే ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు గండ్లు వల్లే విజయవాడ నగరం ముంపునకు గురైందని తెలిపారు. గత నాలుగు రోజులుగా అహర్నిశలు పనిచేసి గండ్లను పూడ్చామన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే బుడమేరుకు ఈ పరిస్థితి వచ్చిందంటూ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి...
Pawan: ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి అందించిన డిప్యూటీ సీఎం
Vinayaka Festival: కాణిపాకంలో ప్రత్యేక ఆకర్షణగా వినాయక ప్రతిమలు..
Read Latest AP News And Telugu News