Home » Village development
రుణమాఫీ విషయంలో ప్రత్యేకంగా కొత్త నిబంధనల పేరుతో కోతలు విధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో రెండుసార్లు రుణమాఫీ అమలైంది. అప్పుడు రెండుసార్లు కలిపి సగంసగమే మాఫీ చేసినా రూ.21వేల కోట్లు నిధులు ఖర్చయ్యాయి.
రాష్ట్రంలో సవరించిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. వాటిని ప్రతిపాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విలువల నిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరుగా ఏర్పాటు చేసిన కమిటీలు ఈనెల 18వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్షేత్ర స్థాయికి వెళ్లనున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
పంచాయతీలతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకూ ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు బీసీ రిజర్వేషన్ల అంశం తేలాకే ఈ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో సర్కారు ఉన్నట్లు తెలిసింది.
ఈ సమస్య కేవలం ఈ మూడు గ్రామ పంచాయతీలది మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 పంచాయతీలూ ఎదుర్కొంటున్నాయి. నాలుగు నెలలుగా కేంద్రం నిధులు రావడం లేదు. ఎస్‌ఎ్‌ఫసీ నిధులు రెండేళ్లలో అప్పుడప్పుడు ఇచ్చినప్పటికీ.. 16 నెలలకు పైగా రావాల్సి ఉందని తెలుస్తోంది. వాస్తవానికి సకాలంలో నిధులు విడుదలైతేనే.. చిన్న పంచాయతీల నిర్వహణ భారంగా ఉంటుంది.
రాష్ట్రంలో రాజకీయ రిజర్వేషన్ల అగ్గి రాజుకుంది. స్థానిక సంస్థల్లో ఏ సామాజికవర్గానికి ఎంత శాతం రిజర్వేషన్ కేటాయిస్తారన్న చర్చ మొదలైంది. మొత్తంగా అన్ని కులాలకు కలిపి 50 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఉండగా.. ఇందులోనే ఎస్సీలు, ఎస్టీలకు రాజ్యాంగబద్ధ విధానంలో జనాభా దామాషా ప్రకారం కల్పించాల్సి ఉంటుంది. మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయించాల్సి ఉంది. దీంతో బీసీలకు తక్కువ శాతం దక్కుతోందన్న అభిప్రాయాలున్నాయి.
: గ్రామపంచాయతీలు నిధుల సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా చిన్న గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేందుకు ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి కూడా డబ్లుల్లేని దుస్థితి. పంచాయతీ భవనాల కరెంటు బిల్లులు కట్టడానికి కూడా నిధుల్లేవని పంచాయతీల ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నంబులపూలకుంట, ఏప్రిల్ 21: మండలంలోని తాటిమానుగుంతలో గత 15రోజులనుంచి తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి నీటిని సరఫరా చేసే రక్షిత తాగునీటి బోరులో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో ట్యాంక్‌కు నీరు సరిగా సరఫరా కావడం లేదు. వచ్చిన అరకొర నీటినే కొళాయి ద్వారా పట్టుకుంటున్నామని, అయితే అవి ఎక్కడా సరిపోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.
ఆ నాయకుడిది మా పక్క ఊరే. ఆయన భార్యే వైసీపీ తరపున పోటీ చేస్తోంది. పక్క ఊరే కావడంతో మా ఊరి సమస్యలు కూడా తెలిసి ఉంటాయని, పరిష్కరిస్తారని ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాం. ఏళ్లు గడిచినా మా ఊరి సమస్యలు మాత్రం తీరలేదని గోవిందురాయునిపేట ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శింగనమల నుంచి రాచేపల్లికి వెళ్లే ప్రధాన రహదారి నుంచి గోవిందురాయునిపేటకు అర కిలోమీటర్ దూరం ఉంది.
తెలంగాణలో సర్పంచ్ల (TS Sarpanch) గోడు వినే నాథుడే లేడా..? ప్రజల కోసం (Public) తమవంతుగా సేవచేయడానికి వచ్చిన..