Home » Vinayaka Chavithi
భాగ్యనగరం హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనాలు 2వ రోజు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి. నిమజ్జనం కోసం అర్ధరాత్రి నుంచి వేలాది వినాయక విగ్రహాలు వరుసలో బారులు తీరాయి. ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం లోపు నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.
‘గణేశ్ మహరాజ్ కీ జై’.. ‘గణపతి బొప్పా మోరియా.. అగ్లే బరస్ తూ జల్దీ ఆ’ అంటూ మేళతాళాలు, నృత్యాల మధ్య ఉప్పొంగిన భక్తిభావంతో కూడిన నినాదాలతో పెద్ద సంఖ్య లో భక్తులు గణనాథుడికి వీడ్కోలు పలికారు.
దేశవ్యాప్తంగా గణపతి నిమజ్జనం జరుగుతుంది. గణేశ్ నిమజ్జనం నేటితో అంటే మంగళవారంతో ముగియనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో వీధులన్నీ భారీ గణనాథులతో ఊరేగింపుగా బయలుదేరాయి. దీంతో లక్షలాది మంది ప్రజలు రహదారులపైకి వచ్చారు.
వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ లడ్డూలపైన అందరి దృష్టి ఉంటుంది. నవరాత్రులు ముగిశాయి. ఖైరతాబాద్‌లోని మహా గణపతి శోభయాత్ర ప్రారంభమైంది. ఇక బాలాపూర్ లడ్డూ సైతం వేలం పాటలో రికార్డు స్థాయిలో ధర పలికింది.
నిమజ్జన కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ప్రజలు ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఇబ్బందులు పడకుండా టీజీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
రాజమహేంద్రవరం సిటీ/కల్చరల్, సెప్టెంబరు 16: గణపతి నవరాత్రులు ముగిసిన సందర్భంగా జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం డివిజన్‌లోని పలు మండపాల్లో పూజలందుకున్న గణపతులకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాజమహేంద్రవరంలో ఉత్సవ కమిటీలు వారి గణపతుల విగ్రహాలను అ
ఒకవైపు రైతులు హెచఎల్‌సీలో నీరు ఎప్పుడు ప్రవహిస్తాయా అని ఎదురుచూపులు చూస్తున్నారు. అదిఅలా ఉంచితే... ఆ నీరు రాకపోవడంతో వినాయక చవితి సందర్భంగా మూడు రోజులు, ఐదు రోజుల పాటు పూజలు నిర్వహించిన మండల వాసులు వినాయక విగ్రహాల నిమజ్జనం హెచఎల్‌సీలో అలాగే వదిలేశారు. మండల వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన ప్రజలకు వినాయకుడిని నిమజ్జనం చేయడానికి నీటి కరువు ఎదురైంది.
పూడూరు మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం సందర్భంగా కొంతమంది యువకులు భారీ ఊరేగింపు చేపట్టారు. సౌండ్ బాక్సులు పెట్టి భారీ శబ్దాలతో హంగామా చేశారు. అయితే అక్కడికి చేరుకున్న ఎస్సై మధుసూదన్.. సౌండ్ బాక్సులకు పర్మిషన్ లేదని, వాటిని ఆపేయాలని యువకులకు సూచించారు.
గణపతి నవరాత్రులు మరికొన్ని గంటల్లో ముగియనున్నాయి. అలాంటి వేళ కృష్ణాజిల్లా పెడన పట్టణంలోని వినాయకుడి పందిరిపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఓ వర్గం ఆందోళనకు దిగింది. అందుకు ప్రతిగా మరో వర్గం వినాయకుడి పందిరికి ఎదురుగా జెండాలు కట్టింది.
ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. గంటకు సరాసరి మూడు నుంచి ఐదు వేల మంది దర్శనం చేసుకుంటున్నారు. ప్రధానంగా వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత..