Share News

Vikarabad: వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత.. చివరికి ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Sep 16 , 2024 | 08:46 AM

పూడూరు మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం సందర్భంగా కొంతమంది యువకులు భారీ ఊరేగింపు చేపట్టారు. సౌండ్ బాక్సులు పెట్టి భారీ శబ్దాలతో హంగామా చేశారు. అయితే అక్కడికి చేరుకున్న ఎస్సై మధుసూదన్.. సౌండ్ బాక్సులకు పర్మిషన్ లేదని, వాటిని ఆపేయాలని యువకులకు సూచించారు.

Vikarabad: వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత.. చివరికి ఏం జరిగిందంటే..

వికారాబాద్: పూడూరులో వినాయక నిమజ్జనంలో ఆదివారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సౌండ్ బాక్సులతో భారీ శబ్దాలు చేయెుద్దంటూ చెప్పిన ఎస్సై, యువకులకు మధ్య వివాదం చెలరేగింది. దీంతో విగ్రహాన్ని రోడ్డుపైనే బైఠాయించి ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. చివరికి సీఐ వచ్చి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో సీఐనే స్వయంగా తన కారులో వినాయకుణ్ని తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.


పూడూరు మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం సందర్భంగా కొంతమంది యువకులు భారీ ఊరేగింపు చేపట్టారు. సౌండ్ బాక్సులు పెట్టి భారీ శబ్దాలతో హంగామా చేశారు. అయితే అక్కడికి చేరుకున్న ఎస్సై మధుసూదన్.. సౌండ్ బాక్సులకు పర్మిషన్ లేదని, వాటిని ఆపేయాలని యువకులకు సూచించారు. దీంతో వారి మధ్య వివాదం మెుదలైంది. అయితే డీజే బాక్సులు ఆపేందుకు ఇష్టపడని యువకులు ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. వారి మధ్య మాటల యుద్ధం చెలరేగడంతో ఆగ్రహించిన వారు వినాయకుడి విగ్రహాన్ని రోడ్డుపైనే దింపేశారు.


పోలీసులు, యువకులకు మధ్య వాగ్వాదం అర్ధరాత్రి వరకూ సాగడంతో విషయం తెలుసుకున్న పరిగి సీఐ శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఎస్సై మధుసూదన్ మద్యం మత్తులో తమపై గొడవకు దిగారంటూ యువకులు సీఐకు చెప్పారు. దీంతో ఎస్సైను శ్రీనివాసరావు అక్కడ్నుంచి పంపించారు. అయితే మధుసూదన్ వచ్చి క్షమాపణలు చేప్తేనే విగ్రహాన్ని రోడ్డుపై నుంచి తీసి నిమజ్జనం చేస్తామంటూ యువకులు భీష్మించారు. దీంతో పోలీసులే తమ వాహనంలో విగ్రహాన్ని తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?

Hyderabad: వైద్యానికి 5 వేల కోట్లు!

Ponnam Prabhakar: బీఆర్‌ఎస్‌ నేతల్లో ఇంకా అదే అహంకారం

Updated Date - Sep 16 , 2024 | 08:49 AM