Share News

Pedana: పెడనలో 144 సెక్షన్ విధించిన పోలీసులు

ABN , Publish Date - Sep 16 , 2024 | 08:14 AM

గణపతి నవరాత్రులు మరికొన్ని గంటల్లో ముగియనున్నాయి. అలాంటి వేళ కృష్ణాజిల్లా పెడన పట్టణంలోని వినాయకుడి పందిరిపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఓ వర్గం ఆందోళనకు దిగింది. అందుకు ప్రతిగా మరో వర్గం వినాయకుడి పందిరికి ఎదురుగా జెండాలు కట్టింది.

Pedana: పెడనలో 144 సెక్షన్ విధించిన పోలీసులు

మచిలీపట్నం, సెప్టెంబర్ 16: గణపతి నవరాత్రులు మరికొన్ని గంటల్లో ముగియనున్నాయి. అలాంటి వేళ కృష్ణాజిల్లా పెడన పట్టణంలోని వినాయకుడి పందిరిపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఓ వర్గం ఆందోళనకు దిగింది. అందుకు ప్రతిగా మరో వర్గం వినాయకుడి పందిరికి ఎదురుగా జెండాలు కట్టింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మచిలీపట్నం నుంచి వ్యక్తులను రప్పించి వినాయకుడిపై మత పెద్దలు రాళ్లు వేయించారని ఓ వర్గం ప్రధానంగా ఆరోపిస్తుంది.


దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకునే అవకాశాలున్నాయని పోలీసులు భావించారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో జిల్లా ఎస్పీ గంగాధర్ పెడనలో పర్యటించారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై ఆయన సమీక్షించారు. అనంతరం పెడనలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ఆయన ఆదేశించారు. దీంతో పెడనలో భారీగా పోలీసులు మోహరించారు.

Also Read: Tripura: గంటల వ్యవధిలో మరో దారుణం


ఈ ఘటన ఆవేశంలో జరిగిందా? లేకుంటే రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందనే అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. వినాయక నవరాత్రులు మరికొన్ని గంటల్లో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో వినాయకుడి ప్రతిమలను నిమజ్జనం చేసేందుకు ఇప్పటికే నిర్వహాకులు చర్యలు చేపట్టిన విషయం విధితమే.

For More National News and Telugu News

Updated Date - Sep 16 , 2024 | 08:19 AM