Home » Virat Kohli
ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్.. వీరందరినీ మించి విరాట్ కోహ్లీ. ఇంత మంది స్టార్స్ ఉన్నా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ సీజన్లో కప్పుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఇప్పటికి ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ఆరింట్లో ఆర్సీబీ ఓడిపోయింది.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL) సంగతి అటుంచితే.. ఈ ఏడాదిలో త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) భారత జట్టులో ఉంటాడా? లేదా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఈ మిస్టరీకి ఎప్పుడు తెరపడుతుందో తెలీదు కానీ..
భారత యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తాజాగా ఓ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో మూడు వేల పరుగుల మైలురాయిని దాటేసి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా.. పంత్ ఈ ఫీట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో (IPL 2024) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య ఆసక్తికర పోరుకు తెరలేచింది. ఈ సీజన్లో ఇరు జట్లూ పేలవంగానే రాణిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి విజయాల సంఖ్యను పెంచుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కీలక మ్యాచ్‌లో టాస్ పడింది.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న జరిగిన RR vs RCB మ్యాచులో విరాట్ కోహ్లీ(Virat Kohli) సెంచరీ చేసినా కూడా RCB ఓటమి చెందింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 113 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సెల్ఫీష్ కోహ్లీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో విరాట్ బ్యాటింగ్ గురించి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) స్పందించారు.
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ పేరు మీద అంతర్జాతీయ క్రికెట్లో చాలా రికార్డులున్నాయి. దేశవాళీ క్రికెట్ లీగ్ ఐపీఎల్‌లోనూ ఎన్నో ఘనమైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే శనివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌పై మాత్రం కోహ్లీ ఏమాత్రం కోరుకోని రికార్డు అతడి ఖాతాలో పడింది. ఐపీఎల్లో సెంచరీ పూర్తి చేయడానికి ఎక్కువ బంతులు ఆడిన క్రిటర్గా విరాట్ నిలిచాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగాడు. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ అజేయ సెంచరీతో దుమ్ములేపాడు. మొత్తంగా 72 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 12 ఫోర్లు, 4 సిక్సులతో 113 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
కింగ్ విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ పరుగుల వరద పారించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 184 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన ఫోర్ల ద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.
ఐపీఎల్-2024లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాజయం పాలైన సంగతి తెలిసిందే.