ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్-5లో ముగ్గురు భారత స్టార్లు
ABN , Publish Date - Mar 12 , 2025 | 02:54 PM
Team India: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా రచ్చ రచ్చ చేసింది. టాప్-5 ర్యాంకింగ్స్‌లో మన ఆటగాళ్లే ముగ్గురు ఉన్నారు. దీన్ని బట్టే భారత్ హవా ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.

చాంపియన్స్ ట్రోఫీ-2025 కప్పును సొంతం చేసుకున్న భారత్.. నయా విశ్వవిజేతగా అవతరించింది. ఆల్రెడీ గతేడాది టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకున్న టీమిండియా.. ఇప్పుడు వన్డేల్లోనూ జెండా పాతింది. తద్వారా వైట్‌బాల్ క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. ఇక్కడితో అయిపోలేదు.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ మెన్ బ్లూ హవా నడిపిస్తోంది. తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-5 బ్యాటర్ల లిస్ట్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లే ఉండటం విశేషం. ఆ ముగ్గురు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
రోకో జోడీ హవా
వన్డే ర్యాంకింగ్స్‌లో 784 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు శుబ్‌మన్ గిల్. చాంపియన్స్ ట్రోఫీలో రాణించడంతో అగ్రస్థానాన్ని పడిపోకుండా కాపాడుకున్నాడీ యంగ్ బ్యాటర్. ఈ లిస్ట్‌లో 756 పాయింట్లతో 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు భారత సారథి రోహిత్ శర్మ. అతడితో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (736 పాయింట్లు) కూడా లిస్ట్‌లో చోటు సంపాదించాడు. కోహ్లీ 5వ ప్లేస్‌లో నిలిచాడు. వీళ్లతో పాటు స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (704 పాయింట్లు) కూడా టాప్-10లో ఉన్నాడు. అతడు 8వ స్థానంలోకి దూసుకొచ్చాడు. ఇలా మొత్తం పది మంది బ్యాటర్ల లిస్ట్‌లో భారత ఆటగాళ్లే నలుగురు చోటు దక్కించుకొని మన తడాఖా ఏంటో చూపించారు. ఇది చూసిన నెటిజన్స్.. టీమిండియాకు తిరుగులేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ భారత్ అంటే.. ఈ జోరు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. అస్సలు తగ్గేదేలే అని ఎంకరేజ్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇవీ చదవండి:
ధోని కొత్త అవతారం.. కప్పు కోసం..
లండన్‌కు గంభీర్.. స్కెచ్‌కు పిచ్చెక్కాల్సిందే
ఆ భారత స్టార్ నా ఫేవరెట్: మాళవిక
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి