Home » Visakhapatnam
విశాఖపట్నం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్ దాన.. శుక్రవారం తెల్లవారు జామున పూరి సమీపంలోని ధమ్రా- హబలి ఖాతి మధ్య ప్రాంతంలో తీరాన్ని దాటింది. దీంతో ఈ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్లు తీరం దాటి సమయంలో వీస్తున్నాయి.
విజయసాయిరెడ్డి కుమార్తె నెహారెడ్డి భీమిలి బీచ్ వద్ద సీఆర్‌జడ్ ప్రాంతంలో సముద్రానికి అతి సమీపంలో శాశ్వత కాంక్రిట్ నిర్మాణం చేపడుతున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. అన్ని వివరాలతో నివేదిక సమర్పించాలని జీవీఎంసీకి ఆదేశం..
Andhrapradesh: దేశమంతా సుభిక్షంగా ఉండాలని, ఆధ్యాత్మిక సంగమం జరగాలి అన్న ఉద్దేశంతో కాశీలో ఒక కార్యక్రమం చేపట్టామని విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. శివకేశవులకు ఇష్టమైన కార్తీక మాసంలో "కాశీలో కార్తీకం" పేరుతో ఒక కార్యక్రమం చేస్తున్నామన్నారు.
Andhrapradesh: హనీ ట్రాప్ కేసులో ఓ అటవీ శాఖ అధికారికి సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి సదరు అధికారిని ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్లో రెండు రోజుల పాటు పోలీసులు విచారించారు. అయితే విచారణ అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన అటవీశాఖ అధికారి.. ఆ తరువాత పత్తాలేకుండాపోయారు.
గుమ్మ పంచాయతీ కర్రి గడ గ్రామానికి చెందిన బడ్నాయిని రాములమ్మ నిండు గర్భిణీని నెలలు నిండి నొప్పులు మొదలయ్యాయి. ఆ గ్రామంలో ఆస్పత్రి సదుపాయం లేకపోవడంతో ప్రసవం కోసం వైద్య కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె భర్త బడ్నాయిని సన్యాసిరావు, అతని అన్నయ్య బడ్నాయిని బొజ్జన్న ఇద్దరు ఎత్తైన కొండ శిఖర గ్రామం నుంచి గుమ్మ పంచాయతీ కేంద్రం వరకు ఆమెను డోలీలో మోసుకొని వచ్చారు.
మధ్య అండమాన్ సముద్రం పరిసరాల్లో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
విశాఖపట్నం మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం సోదాలు నిర్వహించింది.
రాష్ట్రంలో గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేయనున్నట్టు ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు.
Andhrapradesh: విశాఖ 12 వ అదనపు జిల్లా కోర్టులో విచారణకు మంత్రి లోకేష్ హాజరయ్యారు. సాక్షి దినపత్రికలో ‘‘చినబాబు చిరుతిండికి 25 లక్షలండి’’ కథనంపై మంత్రి కోర్టును ఆశ్రయించారు. ఉద్దేష పూర్వకంగా తన పరువుకు భంగం కలిగించారని రూ.75 కోట్ల రూపాయలకు లోకేష్ పరువు నష్టం దావా కేసు వేశారు.
జాయ్ జమీమా తనతోపాటు నగ్నంగా ఉన్న ఫోటోలను చూపించి అతని నుంచి రూ. లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. తనకు విముక్తి కల్పించాలని బాధితుడు బ్రతిమలాడగా... రూ. మూడు కోట్లు డిమాండ్ చేసింది. బాధితుడు హైదరాబాద్ వెళ్ళిపోతాడనే అనుమానంతో ఏడు రోజులు గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసింది.