Share News

Lokesh: ఆ ఖర్చును నా ఖాతాలో వేస్తారా: నారా లోకేశ్

ABN , Publish Date - Oct 18 , 2024 | 11:35 AM

Andhrapradesh: విశాఖ 12 వ అదనపు జిల్లా కోర్టులో విచారణకు మంత్రి లోకేష్ హాజరయ్యారు. సాక్షి దినపత్రికలో ‘‘చినబాబు చిరుతిండికి 25 లక్షలండి’’ కథనంపై మంత్రి కోర్టును ఆశ్రయించారు. ఉద్దేష పూర్వకంగా తన పరువుకు భంగం కలిగించారని రూ.75 కోట్ల రూపాయలకు లోకేష్ పరువు నష్టం దావా కేసు వేశారు.

Lokesh: ఆ ఖర్చును నా ఖాతాలో వేస్తారా: నారా లోకేశ్
Minister Nara lokesh

విశాఖపట్నం, అక్టోబర్ 18: సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం దావా కేసులో ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Minister Nara Lokesh) శుక్రవారం ఉదయం విశాఖ 12 వ అదనపు జిల్లా కోర్టులో విచారణకు హాజరయ్యారు. సాక్షి దినపత్రికలో ‘‘చినబాబు చిరుతిండికి 25 లక్షలండి’’ కథనంపై మంత్రి కోర్టును ఆశ్రయించారు. ఉద్దేష పూర్వకంగా తన పరువుకు భంగం కలిగించారని రూ.75 కోట్ల రూపాయలకు లోకేష్ పరువు నష్టం దావా కేసు వేశారు. ఆగస్ట్ 29 న తొలిసారి క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరవగా.. తిరిగి ఈరోజు (శుక్రవారం) లోకేష్‌ను మరోసారి విశాఖ కోర్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఈ కేసు విషయంలో క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది.

వైసీపీ నేతలు ఆదేశిస్తేనే తిట్టా!


కాగా.. ‘‘చినబాబు చిరుతిండి.. రూ. 25 లక్షలండి’’ అనే టైటిల్‌తో 2019లో సాక్షిప‌త్రిక‌లో అస‌త్యాలు, క‌ల్పితాల‌తో ఓ స్టోరీ ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి న్యాయపోరాటానికి దిగారు. సాక్షి ఎటువంటి వివ‌ర‌ణ వేయ‌క‌పోవ‌డం, నోటీసుల‌కు స్పందించ‌క‌పోవ‌డంతో నారా లోకేష్ పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను విశాఖ‌లో ఉన్నాన‌ని ప్రచురించిన తేదీల్లో.. తానసలు విశాఖలోనే లేనని లోకేష్ తెలిపారు. ప్రభుత్వం ఆహ్వానం మేరకు వచ్చే అతిథులకు చేసిన అతిథి మర్యాదల కోసం చేసిన ఖ‌ర్చుని త‌న‌కు అంట‌గ‌డుతూ త‌న ప్రతిష్టని మంట‌గ‌లిపేందుకు ప్రయ‌త్నించార‌ని లోకేష్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్‌లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు తాను స్వీకరించలేదని స్పష్టం చేశారు.

Yahya Sinwar: ఎవరీ యహ్వా సిన్వర్.. ఇజ్రాయెల్ కాల్పులో మరణించిన హమాస్ అగ్రనేత కథ ఏంటి?


వాస్తవానికి వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణ సమయాల్లో విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఫ్లయిట్‌ టేకాఫ్‌కు సమయముంటే వీఐపీ లాంజ్‌లో కాసేపు సేద తీరతారు. ఇది సర్వసాధారణం. 2014 నుంచి 19 వరకూ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నారా లోకేష్ సైతం విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చి టీ, కాఫీ, స్నాక్స్‌ కోసం ఏకంగా పాతిక లక్షల రూపాయలు ఖర్చు చేశారని ఒక నిరాధార కథనాన్ని సాక్షి ప్రచురించింది. దీనిపై అప్పట్లోనే నారా లోకేష్ మండిపడ్డారు. నీతి లేని కథనాలను సాక్షి ప్రచురిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సాక్షి స్పందించాలేదు. దీంతో సాక్షిపై ఏకంగా రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు లోకేష్ కోర్టుకు హాజరుకానున్నారు.


ఇవి కూడా చదవండి...

Yahya Sinwar: ఎవరీ యహ్వా సిన్వర్.. ఇజ్రాయెల్ కాల్పులో మరణించిన హమాస్ అగ్రనేత కథ ఏంటి?

AP News: భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 18 , 2024 | 12:47 PM