Home » Vizag News
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ఈనెల 22వ తేదీ వరకు స్వచ్ఛ భారత్ ( Swachh Bharat ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెట్రోలియం నేచురల్ గ్యాస్ స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ రమేష్ బిధూరి ( Ramesh Bidhuri ) తెలిపారు.
సంక్రాంతి పండుగ అంటేనే.. రంగురంగుల ముగ్గులు, ఆత్మీయుల పలకరింపులు, కోడిపందేలు.. అందుకే పట్నంలో ఉన్నవాళ్లందరూ
ఏయూ వీసీకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి.. ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రతిష్టను కాపాడాలని ప్రభుత్వాన్ని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ( Peethala Murthy Yadav ) కోరారు. ఏయూ వీసీ సమతను సోమవారం నాడు జన సేన నేతలు కలిశారు. ఏయూ మెయిన్ గేట్ వద్ద జన సేన నిరసన వ్యక్తం చేసింది. ఏయూ తొలి దళిత మహిళా వీసీగా నియమించిన మహిళకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని పీతల మూర్తి యాదవ్ చెప్పారు.
విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లి మృతి చెంది వారం రోజులు గడుస్తున్నా.. కుమారుడు గుర్తించకపోవడం...
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు (Former Minister Dadi Veerabhadra Rao ) కుటుంబం రాజీనామాపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ( Minister Gudivada Amarnath ) స్పందించారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిదన్నారు. దాడి వీరభద్ర రావు కుటుంబానికి ఇప్పటికే పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని.. అప్పుడు వారు తిరస్కరించారని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
పోలవరం, సుజల స్రవంతి, విశాఖ రైల్వే జోన్, మెట్రో విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ( Konatala Ramakrishna ) తెలిపారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కొణతాల రామకృష్ణ చెప్పారు.
2024లో వైసీపీ ప్రభుత్వం ( YCP GOVT ) మారి... టీడీపీ ప్రభుత్వం ( TDP GOVT ) రావాలని విశాఖ పార్లమెంట్ ఇన్‌చార్జి మతుకుమిల్లి శ్రీభరత్ ( Sribharat Mathukumilli ) తెలిపారు. సోమవారం నాడు టీడీపీ జిల్లా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలల్లో టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంట్ ఇన్‌చార్జ్ భరత్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి పాల్గొన్నారు.
విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. విశాఖ జిల్లా గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాంగ్ రేప్ ఘటన కేసును మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఘటన పూర్తి వివరాలు తెలియజేయాలని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్‌కు మహిళా కమిషన్ లేఖ రాసింది.
నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై 10 మంది వరకు గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తెలింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలో పలు లాడ్జిలల్లో నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.
Judgement: బాలికను గర్భవతి చేసిన నిందితుడికి విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. 2018లో న్యూపోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎరుపల్లి దేముడు (55) అనే వ్యక్తి బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. తాజాగా నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ప్రకటించింది.