Share News

Peetala Murthy Yadav: వీసీ సమత ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్టను కాపాడాలి

ABN , Publish Date - Jan 08 , 2024 | 03:34 PM

ఏయూ వీసీకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి.. ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రతిష్టను కాపాడాలని ప్రభుత్వాన్ని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ( Peethala Murthy Yadav ) కోరారు. ఏయూ వీసీ సమతను సోమవారం నాడు జన సేన నేతలు కలిశారు. ఏయూ మెయిన్ గేట్ వద్ద జన సేన నిరసన వ్యక్తం చేసింది. ఏయూ తొలి దళిత మహిళా వీసీగా నియమించిన మహిళకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని పీతల మూర్తి యాదవ్ చెప్పారు.

Peetala Murthy Yadav: వీసీ సమత ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్టను కాపాడాలి

విశాఖపట్నం: ఏయూ వీసీకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి.. ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రతిష్టను కాపాడాలని ప్రభుత్వాన్ని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ( Peethala Murthy Yadav ) కోరారు. ఏయూ వీసీ సమతను సోమవారం నాడు జన సేన నేతలు కలిశారు. ఏయూ మెయిన్ గేట్ వద్ద జన సేన నిరసన వ్యక్తం చేసింది. ఏయూ తొలి దళిత మహిళా వీసీగా నియమించిన మహిళకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని చెప్పారు. సౌత్ జోన్ యూత్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కి వీసీ సమతను ఆహ్వానించలేదన్నారు. దళిత వీసీ మహిళను ఏయూ మాజీ వీసీ ప్రసాద్‌రెడ్డి, ఆయన అనుచరులు, అధికారులు అడుగడుగునా అవమాని స్తున్నారన్నారు. వీసీ సమతకు జనసేన ( Janasena) పార్టీ అండగా ఉంటుంది అని పీతల మూర్తి యాదవ్ తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 08 , 2024 | 03:34 PM