Andhra Pradesh: సోఫాలో తల్లి మృతి.. స్నాక్స్ తింటూ కాలం గడిపిన కుమారుడు.. | An old woman died of a heart attack in Visakhapatnam
Share News

Andhra Pradesh: సోఫాలో తల్లి మృతి.. స్నాక్స్ తింటూ కాలం గడిపిన కుమారుడు..

ABN , Publish Date - Jan 08 , 2024 | 08:51 AM

విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లి మృతి చెంది వారం రోజులు గడుస్తున్నా.. కుమారుడు గుర్తించకపోవడం...

Andhra Pradesh: సోఫాలో తల్లి మృతి.. స్నాక్స్ తింటూ కాలం గడిపిన కుమారుడు..

విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లి మృతి చెంది వారం రోజులు గడుస్తున్నా.. కుమారుడు గుర్తించకపోవడం గమనార్హం. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తుండగా షాకింగ్ విషయాలు తెలిశాయి. బీచ్‌ రోడ్డులో ఉన్న కురుపామ్‌ టవర్‌ లో శ్యామల అతని కుమాుడు శరవణ్ కుమార్ నివాసముంటున్నారు. జనవరి 1 నుంచి వారు కనిపించకపోవడం, ఇంటి తలుపులు తీయకపోవడంతో చుట్టుపక్కలా ఉన్న వారు బంధువుల ఇంటికి వెళ్లారేమో అని భావించారు. కొద్ది రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమచారం అందించారు. వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూసి.. అవాక్కయ్యారు. వృద్ధురాలు సోఫాలో మృతిచెంది ఉండగా ఆమె కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు.

జనవరి 1వ తేదీ నుంచి తన తల్లి నిద్రపోతుందని, ఆమె డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో నిద్ర లేపలేదని పోలీసులకు చెప్పాడు. ఇంట్లో ఉన్న చిరుతిళ్లు తింటూ కాలం గడిపినట్లు శరవణ్ కుమార్ చెప్పాడు. శరవణ్‌ కుమార్‌ బీటెక్‌ పూర్తిచేసి కొన్నాళ్లు బెంగళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. తర్వాత ఉద్యోగం మానేసి తన తల్లితోనే కలిసి ఉంటున్నాడు. అయితే.. శరవణ్ కుమార్ మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో మరో ఉద్యోగంలోకి వెళ్లలేదు. తండ్రి బాలసుబ్రహ్మణ్యం గతంలోనే మృతిచెందాడు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు.

"మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 08 , 2024 | 08:51 AM